Page Loader
Israel: శక్తిమంతమైన లేజర్‌ ఆయుధాన్ని యుద్ధ రంగంలో విజయవంతంగా పరీక్షించిన ఇజ్రాయెల్‌.. 
శక్తిమంతమైన లేజర్‌ ఆయుధాన్ని యుద్ధ రంగంలో విజయవంతంగా పరీక్షించిన ఇజ్రాయెల్‌..

Israel: శక్తిమంతమైన లేజర్‌ ఆయుధాన్ని యుద్ధ రంగంలో విజయవంతంగా పరీక్షించిన ఇజ్రాయెల్‌.. 

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌ తాము అభివృద్ధి చేసిన లేజర్‌ ఆయుధ శక్తిని ప్రత్యక్ష యుద్ధంలో ప్రయోగించి విజయవంతంగా పరీక్షించింది. ఈ సందర్భంగా డజన్ల కొద్దీ ప్రత్యర్థి డ్రోన్లను కూల్చడంలో ఇది కీలకపాత్ర పోషించింది. తమ దేశ రక్షణ శాఖ, ఐడీఎఫ్‌ (ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌) బుధవారం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాయి. ఈ సందర్భంగా వారు "ఐరన్ బీమ్" వ్యవస్థలో తక్కువ శక్తి కలిగిన లేజర్ ఆయుధాన్ని ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఈ ఐరన్ బీమ్ సాంకేతికతలో తక్కువ శక్తి లేజర్ బీమ్‌ను ఇంటర్‌సెప్టర్‌గా వినియోగించామని తెలిపారు. ఈ వ్యవస్థను ఈ ఏడాది రెండవార్ధంలో పూర్తిస్థాయిలో సైన్యంలో ప్రవేశపెట్టనున్నట్లు కూడా వెల్లడించారు.

వివరాలు 

లేజర్ ఆయుధాలు అత్యద్భుతంగా పనిచేశాయి

ఈ సాంకేతికతను ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్‌ సంస్థ అభివృద్ధి చేసింది. ముఖ్యంగా హెజ్‌బొల్లా నుంచి పెరుగుతున్న డ్రోన్‌ ముప్పును దృష్టిలో పెట్టుకొని,తొలుత భావించిన దానికంటే వేగంగా ఈ ఆయుధాన్ని అభివృద్ధి చేశామని రక్షణశాఖ పేర్కొంది. ఐడీఎఫ్‌ ప్రకటించిన ప్రకారం.. "ప్రస్తుత యుద్ధంలో మేము మా వైమానిక రక్షణ వ్యవస్థలతో పాటు లేజర్‌ వ్యవస్థలను కూడా మోహరించాం.ఈ లేజర్ ఆయుధాలు అత్యద్భుతంగా పనిచేశాయి. శత్రువుల చేతి నుంచి వచ్చిన ఆయుధాలను సమర్థంగా అడ్డుకోవడమే కాదు, పౌరుల ప్రాణాలు, జాతీయ ఆస్తులను కూడా రక్షించాయి," అని వెల్లడించారు. డ్రోన్లను ఈ లేజర్‌ ఆయుధంతో విజయవంతంగా కూల్చిన దృశ్యాలను కూడా వారు విడుదల చేశారు.

వివరాలు 

మూడు రకాల లేజర్ ఆయుధ అభివృద్ధి 

రఫేల్‌ సంస్థ ఛైర్మన్‌ యువల్‌ స్టెయింట్జ్‌ మాట్లాడుతూ.. "ప్రపంచంలోనే మొదటిసారిగా, యుద్ధంలో అత్యంత శక్తిమంతమైన లేజర్‌ను పూర్తిగా వినియోగించి ఇంటర్‌సెప్టర్‌గా వాడిన దేశంగా ఇజ్రాయెల్‌ నిలిచింది" అని గర్వంగా ప్రకటించారు. ఇజ్రాయెల్‌ ఇప్పటివరకు మూడు రకాల లేజర్‌ ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేసింది: ఐరన్ బీమ్-ఎం (Iron Beam-M): ఇది భారీ వాహనాలపై అమర్చే అధిక శక్తి కలిగిన లేజర్ ఆయుధం. 50 కిలోవాట్ల శ్రేణి లేజర్‌ను ప్రయోగించి శత్రు లక్ష్యాలను కూల్చగలదు. మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్‌లలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

వివరాలు 

లైట్ బీమ్ (Light Beam): 

ఐరన్ బీమ్‌కు తేలికపాటి వెర్షన్‌గా అభివృద్ధి చేయబడింది.ఇది చిన్న వాహనాలపై అమర్చగలిగేలా రూపొందించబడింది. దీని శక్తి 10 కిలోవాట్ల రేంజ్‌లో ఉంటుంది. ఇది హైఎనర్జీ లేజర్ ఆయుధంగా యూఏవీలు, డ్రోన్ల వంటి చిన్న శత్రు లక్ష్యాలపై సమర్థంగా పనిచేస్తుంది. దీని వినియోగ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఒకేసారి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న 10 లక్ష్యాలను ఇది ధ్వంసం చేయగలదు.

వివరాలు 

నేవల్ ఐరన్ బీమ్ (Naval Iron Beam):  

యుద్ధ నౌకలపై అమర్చే విధంగా రూపొందించబడిన ఈ వెర్షన్ 100 కిలోవాట్ల శక్తి కలిగిన హైఎనర్జీ లేజర్‌ను ఉపయోగిస్తుంది. ఇది యుద్ధనౌకలకు ఎదురయ్యే భారీ దాడులను (సాచురేటెడ్ అటాక్‌) సమర్థంగా తిప్పికొట్టగలదు. కొన్ని వందల మీటర్ల నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది అడ్డుకోగలదు. దీని ద్వారా ఇంటర్‌సెప్షన్‌కు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టంస్ చేసిన ట్వీట్