
హమాస్ నిర్మూలన తర్వాత.. గాజాలో పరిపాలన బాధ్యత ఎవరికి? అమెరికా-ఇజ్రాయెల్ కీలక చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ను నామరూపం లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై భీకర దాడులు చేస్తోంది.
హమాస్ నిర్మూలన తర్వాత గాజాను ఎవరు? ఎలా పాలించాలనే దానిపై ఇజ్రాయెల్, అమెరికా చర్చలు జరుపుతున్నాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు.
అయితే ఇరు దేశాలు ఇంకా స్పష్టమైన ప్రణాళికను ప్రకటించలేదు. కానీ, తర్వాత ఏం చేయాలనే దానిపై పలు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త చర్చిస్తున్న అంశాల్లో.. గాజా భద్రతను బహుళజాతి సైనికి శక్తికి అప్పగించాలన్న విషయం కూడా ఉంది.
గాజాలో గాజా పరిపాలన గాడినపడే వరకు, కొంతకాలం పాటు సమీపంలోని ఏదైనా దేశానికి లేదా యూఎన్ ఏజెన్సీకి అప్పగించాలని ఇజ్రాయెల్, అమెరికా భావిస్తున్నాయి.
గాజా
గాజాను ఆక్రమించే ఉద్దేశం మాకు లేదు: ఇజ్రాయెల్
గాజాలో పరిస్థితులు కుదుట పడ్డాకా, పాలస్తీనా ప్రజలకు పాలన బాధ్యతలను అప్పగించాలనే విధంగా ఇజ్రాయెల్-అమెరికా చర్చిస్తున్నాయి.
గాజాను పాలస్తీనియన్ అథారిటీని సమర్థవంతంగా పాలిస్తుందని బ్లింకెన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
పరిపాలన సంక్షోభాన్ని సాకుగా చూపి.. గాజాను ఆక్రమించే ఉద్దేశం తమకు ఏమాత్రం ఇజ్రాయెల్ పేర్కొంది.
గాజా భద్రతకు బహుళజాతి సైనిక శక్తిని మోహరిస్తే తమ దళాలను పంపుతామని అమెరికా చెబుతోంది.
శాంతి పరిరక్షక దళంలో భాగంగా గాజాకు యూఎస్ దళాలను పంపడం గురించి కచ్చితంగా ఆలోచిస్తామని వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ పేర్కొన్నారు.