Israel - Iran War: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం: దుబాయ్, ఖతార్, కువైట్ ఎయిర్ స్పేస్ మూసివేత
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం భీకర రూపం దరిదాపుగా మిడిల్ ఈస్ట్‌ను వణికిస్తోంది. ఈ ఉదయం ఇజ్రాయిల్ 'ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జుడా' పేరుతో ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించింది. ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేపడుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని లక్ష్యంగా ఉంచి వేట కొనసాగుతోంది. ఇరాన్ ప్రతీకారంగా, అమెరికా మిత్రదేశాలపై క్షిపణి దాడులు మొదలుపెట్టింది. మధ్యప్రాచ్యంలో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రైన్, జోర్డాన్, ఖతార్‌లోని యూఎస్ స్థావరాలపై విరుచుకుపడింది. యూఏఈ రాజధాని అబుదాబికి సమీపంలోని అల్-ధఫ్రా ఎయిర్ బేస్ పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఫలితంగా యూఏఈ గగనతలాన్ని పూర్తిగా మూసేసి, అబుదాబి, దుబాయ్ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసింది.
Details
అసౌకర్యానికి గురవుతున్న ప్రయాణికులు
యూఏఈ మాత్రమే కాకుండా, ఖతార్, కువైట్ కూడా తమ గగనతలాన్ని మూసివేసాయి. ఈ ప్రాంతాల్లో ప్రధాన విమాన మార్గాలు మూసివేయబడటంతో, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన విమానయాన సంస్థలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతేకాక, విమాన సర్వీసులు రద్దు కావడం, రూట్ మార్పులు, వాయు మార్గాల వితరణలతో ప్రయాణీకులు పెద్ద అసౌకర్యానికి లోనవుతున్నారు. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో, అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఎటువంటి మార్గాలు సురక్షితం అవుతాయో జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి.