LOADING...
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారా? ధృవీకరించని పాకిస్థాన్ అధికారులు 
ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారా? ధృవీకరించని పాకిస్థాన్ అధికారులు

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారా? ధృవీకరించని పాకిస్థాన్ అధికారులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2025
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇన్సాఫ్ (PTI) పార్టీ నేత ఇమ్రాన్ ఖాన్ మరణించారా? ఆయనను జైలులో హత్య చేశారనే వార్తలు పాకిస్తాన్‌లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండీ అడియాలా జైలులో ఉన్నారని, అక్కడ హత్యకు గురయ్యారనే ప్రచారం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. బెలూచిస్తాన్ విదేశాంగ శాఖతో సహా వివిధ సోషల్ మీడియా ఖాతాలలో ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారని, ఇందులో ఐఎస్ఐ (ISI) ప్రమేయం ఉందని ఆరోపిస్తూ పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు పాకిస్తాన్ అధికారుల నుంచి ఎలాంటి ధ్రువీకరణ వెలువడలేదు.

వివరాలు 

ఉగ్రవాద పాకిస్తాన్ సంపూర్ణ ముగింపును సూచిస్తుంది

బెలూచిస్తాన్ విదేశాంగ శాఖ మాజీ అధికారి ఒకరు "పాకిస్తాన్ జైళ్లలో నుండి కొన్ని నివేదికలు వెలువడుతున్నాయి. కస్టడీలో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను అసీం మునీర్, ఐఎస్ఐ ఏజంట్లు హత్య చేశారంటూ అనేక వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ సమాచారం నిజమైతే... ఉగ్రవాద పాకిస్తాన్ సంపూర్ణ ముగింపును సూచిస్తుంది. ప్రపంచానికి నిజం బయటపడిన క్షణం నుంచి దాని చివరి చట్టబద్ధత పతనం ప్రారంభమవుతుంది'' అని బలూచిస్తాన్ విదేశాంగ శాఖ ఎక్స్‌లో పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారా? 

వివరాలు 

PTI మద్దతుదారులపై పోలీసులు దాడి 

ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుండి జైలులో ఉండగా,గత కొన్ని నెలలుగా ఆయనను కలవడంపై అప్రకటిత నిషేధం కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో,ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులు.. నోరీన్ ఖాన్,అలీమా ఖాన్,ఉజ్మా ఖాన్ — ఆయన పరిస్థితి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే, జైలు అధికారులు వారితో దారుణంగా వ్యవహరించారని సోదరీమణులు ఆరోపించారు. అడియాలా జైలు బయట గుమిగూడిన PTI మద్దతుదారులపై పోలీసులు దాడి చేశారని కూడా వారు వెల్లడించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది కూడా ఇమ్రాన్ ఖాన్‌ను కూడా కలవడానికి అనుమతించలేదు. ఆయన జైలులో ఆయనను చూడడానికి ఏడు సార్లు ప్రయత్నించినప్పటికీ, జైలు అధికారులు అనుమతించనట్లు నిరాకరించారు. ఈ పరిణామాలు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులలో,PTI పార్టీ సభ్యులలో తీవ్ర ఆందోళన కలిగించాయి.