Imran Khan-Toilet Cleaner: నా భార్యకు టాయ్ లెట్ క్లీనర్ తో కలిపిన విషాహారం ఇచ్చారు: ఇమ్రాన్ ఖాన్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ టెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ)(PTI)వ్యవస్థాప అధ్యక్షుడు, పాక్(Pakistan)మాజీ ప్రధాని(Ex PrimeMinister) ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) జైలు (Jail) అధికారులు, సిబ్బందిపై సంచలన ఆరోపణలు చేశారు.
తన భార్య కు బుష్రా బీబీ (Bushra Bibi)కి జైలులో టాయ్ లెట్ క్లీనర్ (Toilet Cleaner) తో కలిపిన విషాహారాన్నిఇచ్చేవారని ఆరోపించారు.
అందుకే ఆమె కడుపు నొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్ తో బాధపడుతోందని తెలిపారు.
అవినీతి ఆరోపణల కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఓ అవినీతి కేసు విచారణ నిమిత్తం శుక్రవారం రావుల్పిండీలోని అదియాలా జైల్లో ని కోర్టుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జైలు అధికారులు, సిబ్బందిపై సంచలన ఆరోపణలు చేశారు.
Imran Khan-Jail-Claims
జైలు అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్
షౌకత్ ఖానుమ్ ఆసుపత్రి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఆసిమ్ యూసఫ్ ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకిఇస్లామాబాద్ లోని షిఫా అంతర్జాతీయ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదించారు.
జైలు అధికారులు మాత్రం మొండిగా పాకిస్థాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(పిమ్స్)లోనే వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారని ఇమ్రాన్ మండిపడ్డారు.
విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ కస్టడీలో ఉన్నప్పుడు మీడియా సమావేశాలను తప్పించుకోవాలనిన్యాయమూర్తి సూచించగా, తాను మాజీ ప్రధానినని, విలేకరులు ఎప్పుడూ తనతో కలుస్తుంటారని, అయితే తనవ్యాఖ్యల్ని వారు తప్పుగా అర్థం చేసుకుని రాస్తున్నారని సమాధానమిచ్చారు.
పలు అవినీతి కేసుల్లో దోషిగా తేలిన ఇమ్రాన్ ఖాన్ కోర్టు విచారణ అనంతరం మీడియాతో పది నిమిషాలపాటుమాట్లాడేందుకు అనుమతించాలని కోరారు.
Bushra Bibi-Imran Khan wife
తన భార్యకేమైనా అయితే అతడిని వదిలిపెట్టను: ఇమ్రాన్ ఖాన్
తన భార్య బుష్రా బీబీ జైలుకెళ్లేందుకు ప్రత్యక్ష కారణం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ (Army Chief General)అసిమ్ మునీర్ (Asif Munir) కారణమని, ఆయన నుంచి తన భార్య బుష్రా బీబీకి ముప్పు ఉందని ఆరోపించారు.
ఆమెకు ఏమైనా జరిగితే అతడిని వదిలిపెట్టనని, తాను ఎంతకైనా తెగిస్తానని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించాడు.