Loading...
Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌ మృతిచెందారంటూ సంచలన వార్తలు.. పాకిస్థాన్‌లో తీవ్ర ఆందోళన
ఇమ్రాన్‌ ఖాన్‌ మృతిచెందారంటూ సంచలన వార్తలు.. పాకిస్థాన్‌లో తీవ్ర ఆందోళన

Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌ మృతిచెందారంటూ సంచలన వార్తలు.. పాకిస్థాన్‌లో తీవ్ర ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 12, 2026
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ మృతిచెందారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు కలకలం రేపుతున్నాయి. సయీద్‌ ఖాన్‌ అనే పాకిస్థాన్‌ జర్నలిస్ట్‌ చేసిన ఓ సంచలన పోస్ట్‌ ఈ చర్చకు కారణమైంది. ఇమ్రాన్‌ ఖాన్‌ జైల్లోనే ప్రాణాలు కోల్పోయారని ముగ్గురు సీనియర్‌ సైనికాధికారులు తనకు వెల్లడించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ మృతిపై పాకిస్థాన్‌ ప్రభుత్వం లేదా జైలు అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఆయన వాస్తవ ఆరోగ్య పరిస్థితి ఏంటన్న దానిపై పాకిస్థాన్‌ ప్రజలు, పీటీఐ కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

వివరాలు 

కుటుంబానికి అనుమతి నిరాకరణతో అనుమానాలు

ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది.

ఆయనను పరామర్శించేందుకు కుటుంబంతో పాటు వైద్యులను కూడా అనుమతించడం లేదని పీటీఐ ఆరోపించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాలని పార్టీ డిమాండ్‌ చేస్తోంది.

వివరాలు 

20లక్షల మంది వీధుల్లోకి వస్తారన్న పీటీఐ నేత

తమ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌కు ఏదైనా జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో ప్రజా ఉద్యమం చేపడతామని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి, పీటీఐ నేత సోహైల్‌ అఫ్రిది హెచ్చరించారు.

తమ నేతకు ఏదైనా జరిగితే దాదాపు 20 లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

అలాంటి పరిస్థితుల్లో యువతలో చెలరేగే ఆగ్రహాన్ని నియంత్రించేందుకు పాకిస్థాన్‌ మొత్తం సైన్యం కూడా సరిపోదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులు, వైద్యులకు అనుమతి ఇవ్వకపోతే నిరసనలు చేపడతామని పీటీఐ స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

సెప్టెంబర్‌ 27న ఇస్లామాబాద్‌కు భారీ ర్యాలీ

ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో స్పష్టత రాకపోతే సెప్టెంబర్‌ 27న ఇస్లామాబాద్‌ వైపు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పీటీఐ ప్రకటించింది.

ఈ ర్యాలీ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్‌ ఖాన్‌ మృతిచెందారంటూ వస్తున్న వార్తలపై పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు.

జైలు అధికారులు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

ADVERTISEMENT