LOADING...
UK: యూకే నుంచి ఫ్రాన్స్‌కి అక్రమ వలసదారుల తరలింపు ప్రారంభం
యూకే నుంచి ఫ్రాన్స్‌కి అక్రమ వలసదారుల తరలింపు ప్రారంభం

UK: యూకే నుంచి ఫ్రాన్స్‌కి అక్రమ వలసదారుల తరలింపు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2025
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లాండ్‌-ఫ్రాన్స్‌ సరిహద్దు (English Channel) దాటుకొని అక్రమంగా యూకేలో ప్రవేశించిన వలసదారులను ఫ్రాన్స్‌కి తిరిగి తరలించేందుకు యూకే ప్రభుత్వం ప్రక్రియ మొదలు పెట్టింది. గతంలో ఫ్రాన్స్‌తో జరిగిన ఒప్పందం ప్రకారం, ఇలాంటి వలసదారులను ఫ్రాన్స్‌కి పంపించాల్సి ఉంటుందని వెల్లడించారు. బ్రిటన్‌ హోమ్‌ సెక్రటరీ షబనా మహమ్మద్‌ ఈ చర్యను కీలక ముందడుగుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఒక భారతీయుడిని ఫ్రాన్స్‌కి తరలించారు. షబనా మహమ్మద్‌ మాట్లాడుతూ, "ఈ రోజు స్మగ్లర్‌ల ముఠాలకు మేము పెద్ద దెబ్బ కొట్టాము. చిన్న పడవలలో వచ్చిన వలసదారులను ఫ్రాన్స్‌కి తరలించడం ప్రారంభించాము. మా సరిహద్దులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటాం. వీరిని తిరిగి పంపిస్తాం" అని తెలిపారు.

వివరాలు 

 'వన్‌ ఇన్‌ వన్‌ ఔట్‌' పథకం 

మరోవైపు, బ్రిటన్‌ హోమ్‌ శాఖ కూడా దీనిపై స్పందిస్తూ, తరలింపులు ఈ వారంలో లేదా వచ్చే వారం ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే ఫ్రాన్స్‌ కూడా ఒక భారతీయుడిని యూకే నుంచి పంపినట్లు ధృవీకరించింది. దాదాపు నెల క్రితం,ఫ్రాన్స్‌-యూకే మధ్య 'వన్‌ ఇన్‌ వన్‌ ఔట్‌' పథకం కింద వలసదారులను మార్పిడి చేసుకోవడం కోసం ఒప్పందం జరిగింది. ఈ పథకం ప్రకారం, చిన్న బోట్లలో ఇంగ్లిష్‌ ఛానల్‌ దాటినవారు శరణార్థి హోదాకు అర్హత గలవారేనని పరిశీలించిన తర్వాత, వీరిని ఫ్రాన్స్‌కి తరలిస్తారు.

వివరాలు 

 'వన్‌ ఇన్‌ వన్‌ ఔట్‌' పథకం 

అదే సమయంలో, ఫ్రాన్స్‌లో వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారులలో సమాన సంఖ్యను యూకేకి తీసుకొస్తారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకం జూన్‌ 2026 వరకు అమల్లో ఉంటుంది. తాజాగా, యూకేలో ప్రతి సంవత్సరం వేలాది వలసదారులు ప్రవేశించడమే స్థానిక ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అలాగే, ఇక్కడి నౌకల రూట్ అత్యంత రద్దీగా ఉండటం, చిన్న పడవలపై ప్రయాణం వలసదారులకు ప్రాణహానికరంగా మారుతున్న విషయం కూడా చర్చనీయాంశంగా ఉంది.