China: కిండర్ గార్టెన్‌లో కత్తిదాడి; ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కిండర్ గార్టెన్‌లో సోమవారం జరిగిన కత్తి దాడిలో ఆరుగురు మరణించారు. ఒకరు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
చనిపోయిన వారిలో ఒక టీచర్, ఇద్దరు తల్లిదండ్రులు, ముగ్గురు విద్యార్థులు ఉన్నారు.
దక్షిణ చైనాలోని లియాన్‌జియాంగ్ సిటీలోని హెంగ్‌షాన్ పట్టణంలో ఈ ఘటన జరిగింది.
స్థానిక పోలీసులు నిందితుడిని వెంటనే గుర్తించి అరెస్టు చేశారు. దాడి చేసిన వ్యక్తిని వూ మౌజీ(25)గా అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటన ఉదయం 7:40 గంటలకు జరిగింది.
చైనా పౌరులు తుపాకీలను కలిగి ఉండడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధిస్తుంది. ఈ క్రమంలో ఆ దేశంలో ఇటీవలి సంవత్సరాలలో కత్తిపోట్లు ఎక్కువగా జరుగుతున్నాయి.
ప్రత్యేకంగా పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఘోరమైన దాడులు జరుగుతున్నాయి.
చైనా
పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతపై ప్రభుత్వం ఫోకస్
గత ఏడాది ఆగస్టులో ఆగ్నేయ జియాంగ్జి ప్రావిన్స్‌లోని కిండర్ గార్టెన్‌పై కత్తిదాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
ఏప్రిల్ 2021లో, గ్వాంగ్జీ జువాంగ్ స్వయంప్రతిపత్త ప్రాంతంలోని బెయిలియు నగరంలో జరిగిన సామూహిక కత్తిపోటులో ఇద్దరు పిల్లలు మరణించగా, మరో 16మంది గాయపడ్డారు.
అక్టోబర్ 2018లో నైరుతి చైనాలోని చాంగ్‌కింగ్‌లోని కిండర్ గార్టెన్‌లో కత్తి దాడిలో 14మంది పిల్లలు గాయపడ్డారు.
చైనా ప్రభుత్వం కూడా 2010 నుంచి పాఠశాలల చుట్టూ భద్రతను పెంచింది. ఈ దాడుల నేపథ్యంలో పాఠశాలలకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఏప్రిల్ 2021 దాడి తరువాత, పాఠశాలల్లో అంబులెన్స్ సేవలను విద్యా మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది.