'అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచాలి'; సైన్యానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటికే వరుస బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలతో హడలెత్తిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, తన సైన్యానికి మంగళవారం కీలక ఆదేశాలు చేశారు. అణ్వాయుధాల నిల్వలను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించనట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) పేర్కొంది.
ఆయుధ-గ్రేడ్ అణు పదార్థాల ఉత్పత్తిని మరింత పెంచాలని సైన్యానికి కిమ్ పిలుపునిచ్చారు. ఆయుధాలను ఎప్పుడైనా ఉపయోగించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.
కొత్త వ్యూహాత్మక అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులపై వార్‌హెడ్‌లను పరిశీలించేందుకు వచ్చిన క్రమంలో కిమ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
ఉత్తర కొరియా
రెండు బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం
ఇటీవల అణ్వాయుధాల దాడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై కసరత్తను నిర్వహించారు. దీనికి కిమ్ హాజరయ్యారు. ఆ సమయంలో కచ్చితత్వం, విశ్వసనీయత, భద్రత విషయంలో మెరుగ్గా ఉండే 'అణు ట్రిగ్గర్' అని పిలిచే హేక్‌బంగాషో అనే ఐటీ-ఆధారిత సమీకృత అణ్వాయుధ నిర్వహణ వ్యవస్థ గురించి కిమ్‌కు సైనికాధికారులు చెప్పారు.
దీంతో అణ్వాయుధాలను ఎక్కువగా పెంచడానికి, శక్తివంతమైన ఆయుధాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఆయుధాల-గ్రేడ్ పదార్థాలను ఉత్పత్తిని వీలైనంత ఎక్కువగా పెంచాలని కిమ్ ఆదేశించినట్లు కేసీఎన్ఏ తెలిపింది.
ఉత్తర కొరియా సైన్యం సోమవారం అణు వైమానిక విస్ఫోటనాన్ని సృష్టించే రెండు వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.