
మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం ఈజిప్ట్‌లో పర్యటించారు. అమెరికా పర్యటన తర్వాత మోదీ ఈజిప్టు వెళ్లారు.
ఈ సందర్భంగా పలు వ్యూహాత్మక ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోదీ- ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా ఎల్-సీసీ మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో పలు ఒప్పందాలు జరిగాయి.
తాజా ఒప్పందాలతో అరబ్ ప్రపంచంలో భారత్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందనే చెప్పాలి.
అరబ్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న ఈజిప్ట్‌లో ప్రధాని మోదీ పర్యటించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నది.
1997లో అప్పటి ప్రధానమంత్రి ఐకే గుజ్రాల్ తర్వాత ఈజిప్టులో భారత ప్రధాని చేసిన మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే.
మోదీ
ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థ 90ఏళ్లుగా ఈజిప్ట్‌ను పట్టిపీడిస్తోంది: అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా ఎల్- సీసీ
మిడిల్ ఈస్ట్ దేశాల్లో 'ముస్లిం బ్రదర్‌హుడ్' సంఘంతో పాటు దాని రాడికల్ అనుబంధ సంఘాలను అణిచివేసేందుకు ఈజిప్ట్ అధ్యక్షుడు సీసీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో మతపరమైన తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం- ఈజిప్ట్ పరస్పరం కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.
సౌదీ అరేబియా, యూఏఈ కూడా ముస్లిం బ్రదర్‌హుడ్‌ను నిషేధించాయి. దాని అనుబంధ సంస్థలను తీవ్రవాద గ్రూపులుగా ప్రకటించాయి.
ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థ 90 ఏళ్లుగా ఈజిప్టును పట్టిపీడిస్తోందని అధ్యక్షుడు సీసీ అనేక సార్లు వ్యాఖ్యానించారు.
బ్రదర్‌హుడ్ వంటి గ్రూపులు దేశంలో అలజడులను సృష్టిస్తున్నాయని, లక్షలాది మంది శరణార్థులను, తరతరాలుగా తీవ్రవాదులను సృష్టిస్తున్నట్లు చెప్పారు.
విశాల ఈజిప్టు ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లేలా చూడొద్దని మతపరమైన తీవ్రవాదులను ఈజిప్ట్ అధ్యక్షుడు హెచ్చరించారు.