తదుపరి వార్తా కథనం
Bangladesh: భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు మునుపటిలాగే బలంగా ఉన్నాయ్.. మహమ్మద్ యూనస్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 04, 2025
12:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలంగా కొనసాగుతున్నాయని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారినట్లు కొన్ని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ, భారత్-బంగ్లాదేశ్ బంధం సన్నిహితంగానే కొనసాగుతోందని తెలిపారు.
అయితే కొన్ని విభేదాలు తలెత్తిన సంగతి అంగీకరిస్తూ, అవి తాత్కాలికమైనవని, వచ్చిపోయే మేఘాల్లాంటివని ఆయన అభివర్ణించారు.
Details
పునరుద్ధరించే చర్యలు కొనసాగుతున్నాయి
తప్పుడు సమాచారం, దుష్ప్రచారాలే ఈ విభేదాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య సహకారాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
దీనిలో భాగంగా, బంగ్లాదేశ్ అధికారులు భారత్‌తో నిరంతరం సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు మహమ్మద్ యూనస్ వెల్లడించారు.