Page Loader
India-Canada Row: 'భారత్‌లో అప్రమత్తంగా ఉండండి'.. తమ దేశ పౌరులకు కెనడా సూచన 
భారత్‌లో అప్రమత్తంగా ఉండండి'.. తమ దేశ పౌరులకు కెనడా సూచన

India-Canada Row: 'భారత్‌లో అప్రమత్తంగా ఉండండి'.. తమ దేశ పౌరులకు కెనడా సూచన 

వ్రాసిన వారు Stalin
Sep 26, 2023
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడా మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో భారత్‌లో ఉంటున్న కెనడీయన్లకు ఆ దేశం కీలక సూచనలు చేసింది. కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లోని సోషల్ మీడియాలో కెనడాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఇదిలా ఉంటే, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో ఖలిస్థానీ మద్దతుదారులు మంగళవారం కెనడాలోని టొరంటో, ఒట్టావా, వాంకోవర్‌ భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌ల వెలుపల నిరసన తెలిపారు. 'సిక్కులు ఫర్ జస్టిస్' (ఎస్ఎఫ్ జే) నేతృత్వంలో ఈ నిరసన చేపట్టారు.

కెనడా

కెనడాలోని భారతీయులు, దౌత్యవేత్తలకు బెదిరింపులు

కెనడాలోని భారతీయులు, దౌత్యవేత్తలను ఖలిస్థానీలు బహిరంగంగా బెదిరిస్తున్నారని, ఈ పరిస్తితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి చెప్పారు. కెనడాకు చెందిన వ్యక్తులు భారత్‌కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నేర కార్యకలాపాలపై ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని భారత్ కోరింది. ఇదిలా ఉంటే, యూకే, యూఎస్, కెనడా, దుబాయ్, పాకిస్థాన్ ఇతర దేశాలలో నివసిస్తున్న 19 మంది పరారీ ఖలిస్థానీ ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేసిన ఎన్ఐఏ వారి ఆస్తులను కూడా జప్తు చేసేందుకు సిద్ధమవుతోంది.