LOADING...
Wang Yi: భారత్‌, చైనా పరస్పర భాగస్వాములుగా ఉండాలి : వాంగ్‌ యీ
భారత్‌, చైనా పరస్పర భాగస్వాములుగా ఉండాలి : వాంగ్‌ యీ

Wang Yi: భారత్‌, చైనా పరస్పర భాగస్వాములుగా ఉండాలి : వాంగ్‌ యీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌, చైనాలు పరస్పరం ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ముందుకు సాగాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అభిప్రాయపడ్డారు. ఒకరిని మరొకరు ముప్పుగా చూడకుండా, అభివృద్ధికి తోడ్పడే అవకాశంగా చూడాలని ఆయన సూచించారు. వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునే విషయంలో ఇరుదేశాలు కట్టుబడి ఉండాలని తెలిపారు. 2024లో కజాన్‌లో జరిగిన సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భేటీ కావడం తర్వాత భారత్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అన్నారు. అంతేకాక గతేడాది తియాంజిన్‌లో జరిగిన మరో సమావేశం అనంతరం ఇరుదేశాల మధ్య సహకారం మరింత మెరుగుపడిందని పేర్కొన్నారు.

Details

అభివృద్ధిపై దృష్టి సారించాలి

భారత్‌, చైనాలు సత్సంబంధాలు, స్నేహాన్ని కొనసాగించడమే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకోవాలని వాంగ్ యీ అన్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టడం రెండు దేశాలకు కీలకమని ఆయన పేర్కొన్నారు. పొరుగు దేశాలుగా, గ్లోబల్ సౌత్‌లో భాగస్వాములుగా భారత్‌, చైనా మధ్య చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. పరస్పర విశ్వాసం, సహకారం రెండు దేశాల అభివృద్ధికి మేలు చేస్తాయని చెప్పారు. అదే సమయంలో విభజనవాదం, ఘర్షణలు వంటి అంశాలు అభివృద్ధికి అడ్డంకిగా మారతాయని హెచ్చరించారు.

Advertisement