LOADING...
Croatia: క్రొయేషియాలో భారత రాయబార కార్యాలయంపై ఖలిస్థానీ వేర్పాటువాదుల దాడి
క్రొయేషియాలో భారత రాయబార కార్యాలయంపై ఖలిస్థానీ వేర్పాటువాదుల దాడి

Croatia: క్రొయేషియాలో భారత రాయబార కార్యాలయంపై ఖలిస్థానీ వేర్పాటువాదుల దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐరోపా దేశమైన క్రొయేషియాలోని రాజధాని జాగ్రెబ్‌లో భారత రాయబార కార్యాలయం శుక్రవారం దాడికి గురయింది. ఖలిస్థానీ వేర్పాటువాదులు చొరబడి కార్యాలయాన్ని విధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఈ ఘటన ఐరోపా కూటమి ప్రతినిధులు త్వరలో భారత్ పర్యటనకు రాబోతున్న సందర్భంలో చోటుచేసుకోవడం విశేషం.

వివరాలు 

స్పందించిన భారత విదేశాంగశాఖ

భారత విదేశాంగశాఖ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. శాఖ విడుదల చేసిన ప్రకటనలో, "భారత వ్యతిరేక శక్తులు మా రాయబార కార్యాలయంలోకి చొరబడి విధ్వంసం చేయడం భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. వియన్నా ఒప్పందం ప్రకారం, అన్ని దౌత్య ప్రాంగణాల్లో నిబంధనలను ఉల్లంఘించడం వద్దు. ఈ అంశాన్ని క్రొయేషియా అధికారులు దృష్టికి తీసుకెళ్లాము. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాము. ఇటువంటి ఘటనలు వాటి వెనుక ఉన్న వ్యక్తుల స్వభావం, ఉద్దేశాలను ప్రతిబింబిస్తాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి" అని పేర్కొన్నాయి.

వివరాలు 

కెనడా ఆరోపణలను తిప్పికొట్టిన భారత్

గతంలో కెనడా, బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో కూడా ఖలిస్థానీ వేర్పాటువాదులు భారత రాయబారాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. వీటిని భారత్ ఖండించింది. కెనడాలో, ఉగ్రవాద చర్యలను అరికట్టడంలో సుమారు 40 ఏళ్ళుగా విఫలమవుతున్నట్లు అక్కడి భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ ఇటీవల పేర్కొన్నారు. అంతేకాక, ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో భారత్‌పై కెనడా ఆరోపణలను తిప్పికొట్టారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఘటనపై సంబందించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి

Advertisement