LOADING...
India-Maldives : లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ కింద మాల్దీవులకు రూ.4850 కోట్ల ఆర్థిక సాయం కొనసాగింపు
లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ కింద మాల్దీవులకు రూ.4850 కోట్ల ఆర్థిక సాయం కొనసాగింపు

India-Maldives : లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ కింద మాల్దీవులకు రూ.4850 కోట్ల ఆర్థిక సాయం కొనసాగింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
07:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశానికి మాల్దీవులు అత్యంత విశ్వసనీయ దేశమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. "పొరుగుదేశాలకే తొలి ప్రాధాన్యం" అనే విధానంలో మాల్దీవులు ప్రత్యేక స్థానం పొందినట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మాల్దీవులకు రూ.4850 కోట్ల ఆర్థిక సహాయాన్ని కొనసాగిస్తామని చెప్పారు. మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, వాణిజ్యం, రక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరు దేశాలు అంగీకరించాయని తెలిపారు.

వివరాలు 

"పొరుగుదేశాలకే మొదటి ప్రాధాన్యం","సాగర సమృద్ధి" (సాగర్) విధానాల్లో మాల్దీవులకు ప్రధాన స్థానం

భారత్‌-మాల్దీవుల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాన్ని తుది రూపం దిద్దుకునేందుకు ఇరుదేశాలు కలిసి పనిచేయనున్నట్లు చెప్పారు. "పొరుగుదేశాలకే మొదటి ప్రాధాన్యం","సాగర సమృద్ధి" (సాగర్) విధానాల్లో మాల్దీవులకు ప్రధాన స్థానం ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. మాల్దీవులు తమ రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకునే ప్రయత్నాల్లో భారత్ ఎప్పుడూ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

వివరాలు 

పలు ద్వైపాక్షిక అంశాలపై కీలక నిర్ణయాలు

శుక్రవారం ఉదయం, రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మాల్దీవులకు చేరుకున్నారు. వెలెనా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు, కీలక మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన మోదీ, మాల్దీవు అధికారులతోపాటు, అధ్యక్షుడుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంలో ఇరుదేశాల మధ్య మంత్రుల స్థాయిలో చర్చలు జరిగాయి. పలు ద్వైపాక్షిక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం అందింది.