LOADING...
Sri Lanka: ఇంధన సంక్షోభం వేళ శ్రీలంకకు భారత్ చేయూత.. 38 వేల టన్నుల సరఫరా
ఇంధన సంక్షోభం వేళ శ్రీలంకకు భారత్ చేయూత.. 38 వేల టన్నుల సరఫరా

Sri Lanka: ఇంధన సంక్షోభం వేళ శ్రీలంకకు భారత్ చేయూత.. 38 వేల టన్నుల సరఫరా

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో భారత్ తన మానవతా దృక్పథాన్ని మరోసారి చాటుకుంది. చమురు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీలంకకు అత్యవసర సహాయంగా మొత్తం 38 వేల మెట్రిక్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేసింది. ఈ విషయాన్ని కొలంబోలోని భారత హైకమిషన్ వెల్లడించింది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఈ చర్చల అనంతరం భారత్ నుంచి ఈ సహాయం అందినట్లు సమాచారం.

వివరాలు

20 వేల మెట్రిక్ టన్నుల డీజిల్

ఈ సరఫరాలో భాగంగా 20 వేల మెట్రిక్ టన్నుల డీజిల్, 18 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ కొలంబో పోర్టుకు చేరుకున్నాయి. క్లిష్ట సమయంలో భారత్ అందించిన ఈ సహాయానికి శ్రీలంక ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఈ విషయంపై శ్రీలంక ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస కూడా 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. మొత్తంగా ప్రపంచ ఇంధన సంక్షోభ సమయంలో భారత్ అందించిన ఈ సాయం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని భావిస్తున్నారు.

Advertisement