LOADING...
Palestine statehood: ఇండియా కీలక నిర్ణయం.. పాలస్తీనా ప్రత్యేక దేశ ప్రతిపత్తికి సానుకూల ఓటు!
ఇండియా కీలక నిర్ణయం.. పాలస్తీనా ప్రత్యేక దేశ ప్రతిపత్తికి సానుకూల ఓటు!

Palestine statehood: ఇండియా కీలక నిర్ణయం.. పాలస్తీనా ప్రత్యేక దేశ ప్రతిపత్తికి సానుకూల ఓటు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2025
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

పాలస్తీనా కు ప్రత్యేక దేశ ప్రతిపత్తి కల్పించాలంటూ అనేక ఏళ్లుగా ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ, ఐక్యరాజ్యసమితి సర్వసభా తాజాగా తీర్మానం చేపట్టింది. ఈ తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. శుక్రవారం నాడు జరిగిన ఓటింగ్‌లో భారతదేశం అనుకూలంగా ఓటు వేసింది. తీర్మానం పాలస్తీనా-ఇజ్రాయెల్ సమస్యను రెండు దేశాల పరిష్కారం (Two Nation Formula) ద్వారా శాంతియుతంగా పరిష్కరించాలనే దిశలో ఉంది. ఇది న్యూయార్క్ డిక్లరేషన్‌ను ఆమోదించడమే లక్ష్యంగా ఉంది. ఫ్రాన్స్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మొత్తం 142 దేశాలు మద్దతు తెలిపిన తీర్మానానికి 10 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. 12 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేకపోయాయి. గల్ఫ్ దేశాలన్నీ మద్దతు తెలిపారు.

Details

తన వైఖరిని మార్చుకున్న భారత్

వ్యతిరేకంగా ఓటు వేసిన దేశాల్లో అమెరికా, ఇజ్రాయెల్, పలావు, పపువా న్యూ గినియా, టోంగా, అర్జెంటీనా, హంగరీ, నౌరు, పరాగ్వే, మైక్రోనేషియాలు ఉన్నాయి. ఇటీవల గాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన వైఖరిని మార్చుకుంది. గత మూడు సంవత్సరాల్లో కాల్పుల విరమణకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ప్రవేశపెట్టిన నాలుగు తీర్మానాల్లో భారత్ దూరంగా ఉంది. దీని కోసం విమర్శలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ సంపూర్ణ మద్దతు తెలిపింది. డిక్లరేషన్‌లో ఇజ్రాయెల్ చర్యలను తప్పుబట్టుతూ, గాజాలో యుద్ధాన్ని ఆపడానికి, రెండు దేశాల పరిష్కారంతో శాంతియుత పరిష్కారం కోసం పాలస్తీనియన్లు, ఇజ్రాయెలీలు, ప్రాంతీయ ప్రజల భవిష్యత్తును మెరుగుపరచడానికి నాయకులు అంగీకరించారు

Details

1200 మంది మృతి

అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,200 మంది చనిపోయారు, 250 మందిని బందీగా తీసుకున్నారు. ఈ దాడిని డిక్లరేషన్ ఖండించింది. అయితే ఇజ్రాయెల్ గాజాలో చేపట్టిన దాడుల వల్ల పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు, అమాయకులు చనిపోయారని, ఆస్తులు ధ్వంసమై ప్రజలకు ఆహారం అందకపోవడంతో మానవతా సంక్షోభం ఏర్పడిందని డిక్లరేషన్ పేర్కొంది. ఇజ్రాయెల్ నాయకులు రెండు దేశాల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని, పాలస్తీనాకు స్వతంత్ర దేశం గుర్తించాలని, పాలస్తీనియన్లపై హింసను ఆపాలని, ఆక్రమిత ప్రాంతాల్లో స్థావరాలు నిర్మించడం, భూములను లాక్కోవడం ఆపాలని, స్థానికులపై హింసను నిలిపివేయాలని సూచించింది.

Details

వాస్తవ పరిస్థితికి సంబంధం లేదు

అయితే అమెరికా, ఇజ్రాయెల్ తీర్మానానికి వ్యతిరేకంగా నిలిచారు. ఇజ్రాయెల్ తీవ్రంగా విమర్శిస్తూ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక రాజకీయ సర్కస్ లాంటిది, వాస్తవ పరిస్థితికి సంబంధం లేని తీర్మానం అని తెలిపారు. అలాగే హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పేర్కొనకపోవడం గమనార్హమని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఓరెన్ మార్మోర్‌స్టీన్ ఎక్స్‌లో తెలిపారు.