తదుపరి వార్తా కథనం

Jhelum River: ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్‌కు షాకిచ్చిన భారత్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 26, 2025
06:14 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ వద్ద జీలం నదిపై ఉన్న డ్యాం గేట్లను ఒక్కసారిగా ఎత్తేసింది.
దీంతో పాకిస్థాన్‌లోని ముజఫరాబాద్, చకోటి ప్రాంతాల్లో భారీగా వరదలేర్పడ్డాయి. అనేక మంది పాకిస్థానీయులు వరదల ధాటికి చిక్కుకున్నారు.
ముందస్తు హెచ్చరిక లేకుండానే భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం పాక్‌ను తీవ్రంగా షాక్‌కు గురి చేసింది.
మరోవైపు సింధు నదిపై ఉన్న డ్యాం గేట్లను కూడా భారత్ మూసివేయడంతో పాకిస్థాన్‌కు నీటి సరఫరా నిలిపివేసింది.