LOADING...
Putin: భారత్‌ అవమానాన్ని అంగీకరించదు,అమెరికా సుంకాలు విఫలమవుతాయి: ట్రంప్ విధానాలను తీవ్రంగా తప్పుబట్టిన పుతిన్‌!
ట్రంప్ విధానాలను తీవ్రంగా తప్పుబట్టిన పుతిన్‌!

Putin: భారత్‌ అవమానాన్ని అంగీకరించదు,అమెరికా సుంకాలు విఫలమవుతాయి: ట్రంప్ విధానాలను తీవ్రంగా తప్పుబట్టిన పుతిన్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 03, 2025
08:06 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారీస్థాయి సుంకాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీవ్రంగా స్పందించారు. ఇతర దేశాల ఒత్తిడికి భారత్‌ లొంగకూడదని ఆయన స్పష్టం చేశారు. దక్షిణ సోచిలో గురువారం మీడియాతో మాట్లాడిన పుతిన్‌, మాస్కోతో ఇంధన వ్యాపారాన్ని తగ్గించమన్న ట్రంప్‌ ఒత్తిడిని తప్పుపట్టారు. ఇటువంటి చర్యలు చివరికి అమెరికాకే ప్రతికూలంగా మారతాయని ఆయన హెచ్చరించారు.

వివరాలు 

డిసెంబర్‌లో భారత్‌ పర్యటనకు వస్తా: పుతిన్

రష్యా వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే ప్రపంచ ఇంధన ధరలు పెరుగుతాయని, దాని ప్రభావం యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపుకు దారితీస్తుందని అన్నారు. ఫలితంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు నడుస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పుతిన్‌ డిసెంబర్‌లో భారత్‌ పర్యటనకు వస్తానని వెల్లడించారు. అలాగే, భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకున్న సన్నిహిత సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయని పేర్కొన్నారు.