
Sriram Krishnan: ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ పాలసీ అడ్వైజర్‌గా భారతీయ అమెరికన్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరో మూడు వారాల్లో తన బాధ్యతలు స్వీకరించనున్న సమయంలో, తన ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో, ట్రంప్ తన పాలకవర్గంలో అనేక కీలక పదవుల్లో నియామకాలు చేస్తున్నారు.
ఈ పరిణామంలో, ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాలసీ అడ్వైజర్‌గా ప్రముఖ వ్యాపారవేత్త శ్రీరామ్ కృష్ణన్‌ను నియమించారు.
వైట్‌హౌస్ ఆఫీస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో కృష్ణన్ సేవలు అందిస్తారని అధికారికంగా ప్రకటించారు.
వివరాలు
ఈ దేశానికి సేవ చేయడం నాకు పెద్ద గౌరవం: శ్రీరామ్
గతంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్‌బుక్, స్నాప్ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేసిన శ్రీరామ్ కృష్ణన్, ఇప్పుడు శ్వేతసౌధంలో ఏఐ క్రిప్టో జార్ డేవిడ్ శాక్స్‌తో కలిసి ఈ బాధ్యతను నిర్వహించనున్నారు.
కృష్ణన్ తన నియామకంపై స్పందిస్తూ, "ఈ దేశానికి సేవ చేయడం నాకు పెద్ద గౌరవం. ఏఐలో అమెరికా నాయకత్వాన్ని కొనసాగించడానికి, డేవిడ్ శాక్స్‌తో కలిసి నేను పని చేస్తాను" అని పేర్కొన్నారు. కృష్ణన్ నియామకాన్ని అమెరికాలోని భారతీయ కమ్యూనిటీ ఘనంగా స్వాగతించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శ్రీరామ్ కృష్ణన్ చేసిన ట్వీట్
🇺🇸 I'm honored to be able to serve our country and ensure continued American leadership in AI working closely with @DavidSacks.
— Sriram Krishnan (@sriramk) December 22, 2024
Thank you @realDonaldTrump for this opportunity. pic.twitter.com/kw1n0IKK2a