Loading...
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతి నేతల ప్రభావం
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతి నేతల ప్రభావం

US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతి నేతల ప్రభావం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలంలోని చివరి రెండేళ్లలో కాంగ్రెస్‌పై ఆధిపత్యం ఎవరికి దక్కుతుందో నిర్ణయించే ఈ ఎన్నికల పోలింగ్ మంగళవారం ముగిసింది. దేశవ్యాప్తంగా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, 100 మంది సభ్యులున్న సెనెట్‌లోని 37 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు 36 రాష్ట్రాల్లో గవర్నర్ పదవులకు కూడా ఓటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు కీలక పదవుల కోసం పోటీ పడుతుండటంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

వివరాలు 

ప్రతినిధుల సభకు సుహాస్ సుబ్రమణ్యం

భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ నేత సుహాస్ సుబ్రమణ్యం విజయం సాధించారు.

వర్జీనియాలోని 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన ఆయనకు 61 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి.

దీంతో ఆయన మరోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.

ఆయన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డేవ్ బెక్‌విత్‌కు 36 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

గతంలో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సుహాస్ వైట్‌హౌస్‌లో టెక్నాలజీ పాలసీ సలహాదారుగా పనిచేశారు.

వివరాలు 

ఒహాయోలో వెనుకంజలో వివేక్ రామస్వామి

అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఒహాయో గవర్నర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి వెనుకంజలో ఉన్నారు.

రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆయనకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించారు.

కేరళ మూలాలున్న వివేక్.. డెమోక్రటిక్ అభ్యర్థి అమీ యాక్టన్‌తో తలపడుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం, అమీ యాక్టన్ కంటే వివేక్ దాదాపు 2 లక్షల ఓట్ల వెనుక ఉన్నారు.

ఫ్లోరిడాలో పియా దండియా ఆధిక్యం

ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పియా దండియా ముందంజలో ఉన్నారు.

మాజీ హైస్కూల్ ప్రిన్సిపాల్ అయిన ఆమె.. రిపబ్లికన్ అభ్యర్థి కేసీ అస్కర్‌పై దాదాపు 11 వేల ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

కాలిఫోర్నియా, వాషింగ్టన్‌లో ఆసక్తికర పోరు

సిలికాన్ వ్యాలీలోని కొన్ని ప్రాంతాలు ఉన్న కాలిఫోర్నియాలోని 17వ డిస్ట్రిక్ట్‌లో ఇద్దరు భారత సంతతి నేతల మధ్య పోటీ నెలకొంది.

ఇక్కడ డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నాపై రిపబ్లికన్ నేత రితేష్ టాండన్ బరిలో ఉన్నారు.

వాషింగ్టన్‌లోని 7వ డిస్ట్రిక్ట్‌లో సిట్టింగ్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ను రిపబ్లికన్ నేత నీరవ్ సేథ్ ఢీకొంటున్నారు.

ఈ రెండు స్థానాలకు సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువడలేదు.

ADVERTISEMENT

వివరాలు 

మేయర్ పదవులపైనా భారతీయుల గురి

వీరితో పాటు కాలిఫోర్నియా నుంచి సిట్టింగ్ కాంగ్రెస్ సభ్యుడు అమీ బేరా, అరిజోనా నుంచి అమీష్ షా, టెక్సాస్ నుంచి పూజా సేథి, సందీప్ శ్రీవాస్తవ సహా పలువురు భారత సంతతి అభ్యర్థులు వివిధ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.

లాస్ ఏంజిల్స్ నగర మేయర్ పదవికి నిత్యా రామన్ పోటీ చేస్తున్నారు.

ఆమె విజయం సాధిస్తే, అమెరికాలోని రెండు అతిపెద్ద నగరాలైన న్యూయార్క్, లాస్ ఏంజిల్స్‌కు భారత సంతతికి చెందినవారే మేయర్లుగా ఉంటారు.

కొన్ని స్థానాల్లో ఫలితాలు వెలువడగా, మరికొన్ని కీలక నియోజకవర్గాల్లో భారత సంతతి అభ్యర్థుల గెలుపోటములపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

దీంతో ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT