Page Loader
Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో పడిపోయిన  భారత బస్సు 
నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో పడిపోయిన భారత బస్సు

Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో పడిపోయిన  భారత బస్సు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 23, 2024
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో భారతీయ బస్సు శుక్రవారం ప్రమాదానికి గురైన వార్త వెలుగులోకి వచ్చింది. 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు తనహున్ జిల్లాలో మర్స్యంగ్డి నదిలో పడిపోయిందని నేపాల్ పోలీసులు ధృవీకరించారు. సమాచారం ప్రకారం, యూపీ నంబర్ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సహకారంతో పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. UP FT 7623 నంబర్ ప్లేట్ ఉన్న బస్సు నదిలో పడి నది ఒడ్డున పడి ఉందని జిల్లా పోలీసు కార్యాలయం తనహున్ డీఎస్పీ దీప్‌కుమార్ రాయ తెలిపారు. అధికారి తెలిపిన వివరాల ప్రకారం,బస్సు పోఖారా నుంచి ఖాట్మండుకు వెళ్తోంది. సంఘటనా స్థలంలో పోలీసులు,అధికారులు ఉన్నారని తెలిపారు.ప్రజలను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 నదిలో పడిపోయిన  భారత బస్సు