LOADING...
Thailand visa free: ఇక వీసాకు పైసా చెల్లించకుండానే.. భారతీయులు థాయ్‌లాండ్‌కు వెళ్లొచ్చు 
Thailand visa free: ఇక వీసాకు పైసా చెల్లించకుండానే.. భారతీయులు థాయ్‌లాండ్‌కు వెళ్లొచ్చు

Thailand visa free: ఇక వీసాకు పైసా చెల్లించకుండానే.. భారతీయులు థాయ్‌లాండ్‌కు వెళ్లొచ్చు 

వ్రాసిన వారు Stalin
Oct 31, 2023
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

థాయ్‌‌లాండ్‌ని సందర్శించాలనుకునే భారతీయులకు ఆ దేశ టూరిజం అథారిటీ శుభవార్త చెప్పింది. ఇక మీదట థాయ్‌లాండ్‌కు వెళ్లాలనునే భారతీయులు ఎలాంటి వీసా రుసుము లేకుండానే ఆ దేశంలో పర్యటించవచ్చు. ఆ దేశానికి వెళ్లేవారు వీసా రుసుము కింద రూ.3000ను ఎయిర్ పోర్టులో చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు మీరు ఈ రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్‌లాండ్ ఇలాంటి పలు ఆఫర్లను ప్రకటించింది. మే 10, 2024 వరకు భారతీయులు వీసా రుసుము లేకుండానే పర్యటించవచ్చని ఆ దేశం ప్రకటించింది. సెప్టెంబర్‌లో చైనా పర్యాటకులకు ఆకర్షించేందుకు థాయ్‌లాండ్ ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించింది. తాజాగా ఇండియా భారతీయ టూరిస్టుల కోసం ఈ నిర్ణయం తీసుకుంది.

వీసా

వీసా లేకుండా 30 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో ఉండొచ్చు

అలాగే మరో ఆఫర్‌ను కూడా టూరిజం అథారిటీ ఆఫ్ థాయ్‌లాండ్ ప్రకటించింది. భారతదేశం, తైవాన్ నుంచి వచ్చే సందర్శకుడు వీసా లేకుండా 30 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో ఉండొచ్చని పేర్కొంది. ఈ ఏడాది నవంబర్ 10 నుంచి మే 10 వరకు థాయ్‌లాండ్‌లో వీసా రహిత ప్రవేశ ప్రయోజనాన్ని భారతదేశం, తైవాన్ ప్రయాణికులు పొందుతారని థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి శ్రేతా థవిసిన్ చెప్పారు. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మంత్రివర్గ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు అక్టోబర్ 24న, శ్రీలంక క్యాబినెట్ పైలట్ ప్రాజెక్ట్‌గా.. మార్చి 31 వరకు భారతదేశం, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ సందర్శకుల ఉచిత వీసాలు జారీ చేయడానికి ఆమోదించింది.