California: కాలిఫోర్నియాలో భారతీయ కుటుంబం మృతి.. భార్యభర్తలకు తుపాకీ గాయాలు
భారతీయ అమెరికన్ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు కాలిఫోర్నియాలోని తమ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతులను ఆనంద్ హెన్రీ (42), అతని భార్య ఆలిస్ ప్రియాంక (40), వారి కవల పిల్లలు నోహ్, నాథన్‌గా గుర్తించారు. పిల్లల వయస్సు నాలుగు సంవత్సరాలు. కేరళలోని కొల్లంకు చెందిన ఈ కుటుంబం అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. పిల్లలిద్దరూ వారి బెడ్‌రూమ్‌లో చనిపోయారని, తల్లిదండ్రులు బాత్‌రూమ్‌లో తుపాకీ గాయాలతో కనిపించారని శాన్ మాటియో పోలీసులు ధృవీకరించారు. తల్లిదండ్రులపై తుపాకీ గాయాలను పరిశీలించిన పోలీసులు.. ఇందుకోసం 9 ఎంఎం పిస్టల్‌ను ఉపయోగించినట్లు వెల్లడించారు.
గతంలో విడాకుల కోసం భార్యభర్తల దరఖాస్తు
డిసెంబరు 2016లో ఆనంద్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కోర్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే విచారణ పూర్తి కాలేదు. ఐటి నిపుణులు ఆనంద్ మరియు ఆలిస్ తొమ్మిదేళ్లుగా అమెరికాలో నివసిస్తున్నారు. ఆనంద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేయగా, ఆలిస్ సీనియర్ అనలిస్ట్‌గా ఉన్నారు. అయితే సంఘనటా స్థలంలో సూసైడ్ నోట్ ఏదీ కనుగొనబడలేదని, ఇన్వెస్టిగేటివ్ అధికారులను అధారాలను సేకరిస్తున్నారని పోలీసులు తెలిపారు. గత డిసెంబర్‌లో మసాచుసెట్స్ రాష్ట్రంలోని వారి భవనంలో భారతీయ సంతతికి చెందిన దంపతులు, వారి కుమార్తె శవమై కనిపించారు. ఆ ఘటన జరిగిన రెండు నెలలకే మరొకటి వెలుగులోకి చుట్టుపక్కల ఉన్న భారతీయ అమెరిన్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.