Red Sea Attack: ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి.. 14 మంది సిబ్బంది సురక్షితం
ఈ వార్తాకథనం ఏంటి
ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి చోటుచేసుకుంది. మంగళవారం యెమెన్ జలాల సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఎంఎస్‌వీ ఫైజ్ నూరే ఒలియా (MSV Faiz Noore Oliya) అనే నౌక తీవ్రంగా దెబ్బతిని చివరకు తలకిందులై నీటిలో మునిగిపోయింది. దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 14 మంది సిబ్బంది ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే యెమెన్ తీర ప్రాంత రక్షక దళం (కోస్ట్ గార్డ్) సహాయక చర్యలు ప్రారంభించింది. ప్రమాదంలో చిక్కుకున్న 13 మంది భారతీయ సిబ్బందితో పాటు ఒక యెమెన్ పౌరుడిని సురక్షితంగా రక్షించింది. అనంతరం వారిని సమీప పోర్టుకు తరలించి తక్షణ వైద్య సేవలు అందించింది.
వివరాలు
భారత్ తీవ్ర ఆందోళన
ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ క్షిపణి దాడిని ఖండించింది.
కేంద్ర పోర్టులు,షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ ఎక్స్ వేదికగా స్పందించారు.
యెమెన్ జలాల సమీపంలో భారత నౌక ఎంఎస్‌వీ ఫైజ్ నూరే ఒలియా క్షిపణి దాడికి గురై మునిగిపోయిందని పేర్కొన్నారు.
ఎలాంటి కారణం లేకుండా వాణిజ్య నౌకపై దాడి జరగడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని, భారతీయుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
వివరాలు
4 మంది నావికులను రక్షించిన యెమెన్ కోస్ట్ గార్డ్
అలాగే, నౌకలోని మొత్తం 14 మంది నావికులను యెమెన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించి పోర్టుకు తరలించినట్లు తెలిపారు.
దాడి జరిగిన ప్రాంతంలో భారతీయ నావికుల పూర్తి భద్రతను నిర్ధారించడంతో పాటు, ప్రమాదం నుంచి బయటపడిన సిబ్బందికి అవసరమైన అన్ని రకాల సహాయం అందేలా సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ జనరల్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (DGMA) అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సర్బానంద సోనోవాల్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్
Indian MSV Faize Noore Oliya has been hit by a projectile near Yemeni waters, causing the vessel to capsize and sink.
— Sarbananda Sonowal (@sarbanandsonwal) August 4, 2026
India strongly condemns this unprovoked attack on the defenseless mechanised sailing vessel. The safety of our people is our supreme priority & I am relieved to…