Guinness World Record: అమెరికాలో ఘనంగా భారత స్వాతంత్య్ర వేడుకలు.. గిన్నిస్ రికార్డు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని న్యూయార్క్ ట్రై-స్టేట్ ప్రాంతంలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గిన్నిస్ ప్రపంచ రికార్డు నమోదైంది. భారత 80వ స్వాతంత్ర్య వేడుకలను అమెరికా 250వ వార్షికోత్సవంతో అనుసంధానిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూజెర్సీలోని పార్సిప్పనీ వెటరన్స్ మెమోరియల్ పార్క్‌లో 1,300కు పైగా అమెరికా జెండాలను భారత త్రివర్ణ పతాకాల మధ్య అమర్చారు. వాటితో '250' ఆకారాన్ని రూపొందించారు. ఈ వినూత్న ఏర్పాటుకు 'లార్జెస్ట్ ఫ్లాగ్‌పోల్ నంబర్' విభాగంలో గిన్నిస్ ప్రపంచ రికార్డు దక్కింది.
వివరాలు
భారతీయ అమెరికన్ల పాత్రపై ప్రశంసలు
ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఐఏ) సంయుక్తంగా నిర్వహించాయి.
భారతీయ సంతతికి చెందిన పలువురు ప్రతినిధులు, వ్యాపార, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత్, అమెరికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భారతీయ అమెరికన్లు పోషిస్తున్న కీలక పాత్రను వక్తలు కొనియాడారు.
వివరాలు
టైమ్స్ స్క్వేర్‌లోనూ వేడుకలు
న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్‌లోనూ భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
భారత్ 80వ స్వాతంత్య్ర వేడుకలు, అమెరికా 250వ వార్షికోత్సవాన్ని ఒకే వేదికపై నిర్వహించడం ద్వారా ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహం, సాంస్కృతిక అనుబంధాన్ని చాటిచెప్పేలా కార్యక్రమాలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.