Loading...
Arshdeep Singh Dang : యూకేలో తొలి సిక్కు ఫైటర్ పైలట్‌గా భారత సంతతి యువకుడి ఘనత
యూకేలో తొలి సిక్కు ఫైటర్ పైలట్‌గా భారత సంతతి యువకుడి ఘనత

Arshdeep Singh Dang : యూకేలో తొలి సిక్కు ఫైటర్ పైలట్‌గా భారత సంతతి యువకుడి ఘనత

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సంతతికి చెందిన అర్ష్‌దీప్ సింగ్ డాంగ్‌ (Arshdeep Singh Dang) బ్రిటన్‌లో అరుదైన ఘనత సాధించారు. 28 ఏళ్ల వయసులోనే బ్రిటన్‌ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ (RAF)లో ఫైటర్‌ పైలట్‌గా ఎంపికయ్యారు. దీంతో యూకేలో ఫైటర్‌ పైలట్‌గా విధులు చేపట్టిన తొలి భారత సంతతి సిక్కు వ్యక్తిగా గుర్తింపు పొందారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్‌ మిలిటరీ ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ సిస్టమ్‌ ద్వారా శిక్షణ పూర్తి చేసి పట్టభద్రుడైన తొలి సిక్కు వ్యక్తి కూడా అర్ష్‌దీపే అని ఆర్‌ఏఎఫ్‌ వెల్లడించింది.

వివరాలు 

చంఢీగఢ్‌లో జన్మించి.. ఆరేళ్లకే బ్రిటన్‌కు

అర్ష్‌దీప్ సింగ్ 1998లో చంఢీగఢ్‌లో జన్మించారు.ఆయనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు కుటుంబం బ్రిటన్‌కు వలస వెళ్లింది.

ఆయన తండ్రి జగ్దీప్ సింగ్ డాంగ్‌ పంజాబ్‌లోని లూధియానాకు చెందినవారు కాగా.. తల్లి గగన్‌దీప్ కౌర్‌ అమృత్‌సర్‌కు చెందినవారు.

బ్రిస్టల్‌ విశ్వవిద్యాలయంలో అర్ష్‌దీప్ గణితం, తత్వశాస్త్రంలో పట్టా పొందారు.

కఠిన శిక్షణతో ఫైటర్ పైలట్‌గా..

2022 ఫిబ్రవరిలో అర్ష్‌దీప్ ఆఫీసర్‌ శిక్షణ పూర్తి చేశారు. ఆ తర్వాత 2023లో ప్రాథమిక ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ పూర్తిచేశారు.

సైప్రస్‌లో కొన్ని నెలలపాటు విధులు నిర్వర్తించిన అనంతరం 2024లో ఫాస్ట్‌ జెట్‌ స్ట్రీమ్‌కు ఎంపికయ్యారు.

2025లో ఫాస్ట్‌ జెట్‌ లీడ్‌-ఇన్‌ శిక్షణ తీసుకున్నారు. 2026లో వింగ్స్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించారు.

వివరాలు 

తండ్రి ప్రోత్సాహమే కారణమన్న అర్ష్‌దీప్

అయితే యుద్ధ క్షేత్రంలో ఫైటర్‌ జెట్‌ పైలట్‌గా విధుల్లోకి వెళ్లేందుకు ముందు అర్ష్‌దీప్‌ మరో ఏడాది పాటు కఠినమైన శిక్షణ పొందాల్సి ఉంది.

తనకు లభించిన ఈ అరుదైన గుర్తింపుపై అర్ష్‌దీప్ సింగ్ డాంగ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఫైటర్‌ పైలట్‌గా శిక్షణ పొందే దిశగా అడుగులు వేశానని తెలిపారు.

బ్రిటన్‌ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందించే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ADVERTISEMENT