LOADING...
Vishen Lakhiani: అమెరికాలో విషెన్ లఖియానీకి చేదు అనుభవం.. యూఎస్ ఎయిర్‌పోర్టులో తనను ఎఫ్‌బీఐ అడ్డుకుందని ఆవేదన
యూఎస్ ఎయిర్‌పోర్టులో తనను ఎఫ్‌బీఐ అడ్డుకుందని ఆవేదన

Vishen Lakhiani: అమెరికాలో విషెన్ లఖియానీకి చేదు అనుభవం.. యూఎస్ ఎయిర్‌పోర్టులో తనను ఎఫ్‌బీఐ అడ్డుకుందని ఆవేదన

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2025
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఎడ్టెక్ సంస్థ 'మైండ్‌వ్యాలీ' స్థాపకుడిగా, సీఈఓగా ఉన్న విషెన్ లఖియానీకి అమెరికాలో ఒక చేదు అనుభవం ఎదురైంది. భారతీయ వంశావళి కలిగిన ఈ మలేషియన్ పారిశ్రామికవేత్త, అమెరికాలో పెరుగుతున్న జాత్యహంకార ధోరణులు, విదేశీయుల పట్ల పెరుగుతున్న వ్యతిరేకతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తులకు ఇచ్చే ఓ-1 వీసా తన వద్ద ఉన్నప్పటికీ, యూఎస్ ఎయిర్‌పోర్టులో ఎఫ్‌బీఐ అధికారులు తనను నిలిపివేశారని ఆయన వెల్లడించారు.

వివరాలు 

అమెరికాకు రావాలన్న ఆలోచన కూడా ఇప్పుడు భయాన్ని కలిగిస్తోంది

ఘటన అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టిన లఖియానీ, "ఒకప్పుడు ఎంతో ఇష్టపడ్డ అమెరికాకు రావాలన్న ఆలోచన కూడా ఇప్పుడు భయాన్ని కలిగిస్తోంది" అని ఆవేదనగా తెలిపారు. గత 22 సంవత్సరాలుగా యునైటెడ్ స్టేట్స్‌లో పన్నులు చెల్లిస్తున్నానని, తన సంస్థలో ప్రపంచం నలుమూలల నుంచి 230 మంది పని చేస్తున్నారని చెప్పారు. కొందరు నాయకులు తమ వైఫల్యాల్ని దాచుకోవడానికి వలసదారులపై నిందలు మోపుతున్నారనీ, అందుకే దేశం మరింత అసహనంగా మారుతోందనీ విమర్శించారు.

వివరాలు 

వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ వీడియో

లఖియానీ పోస్ట్ కాసేపులోనే సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశమైంది. లక్షలాది మంది వీడియోను వీక్షించగా, అనేకమంది ఆయన బాధను పంచుకున్నారు. "ఇలాంటి వివక్షాత్మక పరిస్థితుల వల్లనే నా దగ్గర టాలెంట్ వీసా ఉన్నప్పటికీ అమెరికా విడిచిపెట్టాల్సి వచ్చింది" అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు "మీ అనుభవం వినడం నిజంగా బాధాకరం" అని స్పందించారు. ఈ ఘటనతో అమెరికా వలస విధానం, విదేశీ నిపుణులపై వ్యవహారశైలి గురించి మరోసారి చర్చ మొదలైంది.