LOADING...
Indian-Origin Co Pilot: చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. భారత సంతతి డెల్టా పైలట్ అరెస్ట్ 
చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. భారత సంతతి డెల్టా పైలట్ అరెస్ట్

Indian-Origin Co Pilot: చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. భారత సంతతి డెల్టా పైలట్ అరెస్ట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మూలాలను కలిగిన కోపైలట్ రుస్తుం భగ్వాగర్‌ను అమెరికాలో అరెస్టు చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో,ఆయన ఉన్న కాక్‌పిట్‌లోపలకే చేరిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో విధులు నిర్వహిస్తున్న భగ్వాగర్‌పై చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. మిన్నియాపోలిస్ నుంచి బయలుదేరిన డెల్టా సంస్థకు చెందిన బోయింగ్ విమానం శాన్‌ఫ్రాన్సిస్కోలో ల్యాండ్ అయిన వెంటనే, దాదాపు పది నిమిషాల్లో పోలీసుల బృందం నేరుగా కాక్‌పిట్‌లో ప్రవేశించి భగ్వాగర్‌ను అరెస్టు చేసింది. ఈ ఘటనతో విమానంలో దిగి వెళ్లేందుకు ఎదురుచూస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సాయుధ భద్రతా సిబ్బంది లోపలికి వచ్చి, భగ్వాగర్‌కు బేడీలు వేసి తీసుకెళ్లారని ఓ ప్రయాణికుడు మీడియాకు వెల్లడించారు.

వివరాలు 

ఘటనపై అధికారికంగా స్పందించిన  డెల్టా ఎయిర్‌లైన్స్ 

వారు వేర్వేరు అధికార సంస్థలకు చెందిన యూనిఫామ్‌లు ధరించి ఉన్నారని ఆయన చెప్పారు. ఈ అరెస్టుతో భగ్వాగర్‌ షాక్‌కు గురయ్యాడు.తన అరెస్టు విషయమై ముందుగా సమాచారం లేదని ఆయన తెలిపారు. ఆయన పరారయ్యే అవకాశం ఉందని భావించిన అధికారులు,ఈ మొత్తం ప్రక్రియను పూర్తిగా రహస్యంగా నిర్వహించారు. చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఈ ఏడాది ఏప్రిల్ నుండి అతనిపై విచారణ కొనసాగుతుండగా, ఆ దర్యాప్తు ప్రభావంగా ఆదివారం అతన్ని అరెస్టు చేశారు. ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ అధికారికంగా స్పందించింది. "ఏదైనా అనైతిక ప్రవర్తనను మా సంస్థ ఎప్పుడూ సహించదు. భగ్వాగర్‌పై వచ్చిన ఆరోపణలు మమ్మల్ని తీవ్రంగా కలిచివేశాయి. అతనిని తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నాము," అని డెల్టా ప్రకటనలో తెలిపింది.