
US: అమెరికాలో డ్రగ్స్ కేసులో భారత సంతతి వైద్యుడు అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
అక్రమంగా శక్తివంతమైన మందులను సరఫరా చేసి, ప్రిస్క్రిప్షన్‌లను మేకవాటిగా ఉపయోగించి మహిళా రోగులను లైంగికంగా వాడుకుంటున్న భారత సంతతికి చెందిన వైద్యుడిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూజెర్సీలోని సెకాకస్ నివాసి, 51 ఏళ్ల డాక్టర్ రితేష్ కల్రా (Ritesh Kalra) పలు తీవ్ర ఆరోపణల్లో నిలిచిన నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం, కల్రా సెకాకస్‌లో 'ఫెయిర్ లాన్ క్లినిక్' అనే ప్రైవేట్ క్లినిక్‌ను నడుపుతూ 2019 నుంచి 2025 ఫిబ్రవరి వరకు అవసరం లేకపోయినా పెద్ద ఎత్తున డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్‌లను అందించేవాడు.
Details
బాధితుల ఫిర్యాదు
ప్రధానంగా ఆయుపైనే ఆధారపడి ఉండే ఆక్సికోడోన్ (Oxycodone) వంటి శక్తివంతమైన పైన్ కిల్లర్ మందులను రాసి ఇచ్చేవాడు. ఈ సమయంలో అతడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్‌ల సంఖ్య 31,000 దాటినట్లు విచారణలో వెల్లడైంది. ఈ మందులకు అలవాటు పడి మరింత మందులు కావాలని కల్రాను సంప్రదించిన మహిళా రోగులకు, తదుపరి ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలంటే తన లైంగిక కోరికలు తీర్చాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు బాధితులు ఫిర్యాదులు చేశారు. తన ప్రవర్తన అసభ్యంగా ఉందనీ, లైంగిక దాడులకు పాల్పడినట్లు పలువురు మహిళలు పోలీసులకు అవేదన వ్యక్తం చేశారు.
Details
వైద్య లైసెన్సును సస్పెండ్ చేసిన అమెరికా కోర్టు
వీటితోపాటు, డ్రగ్ మిస్‌యూజ్, రోగుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడం, చట్టాల ఉల్లంఘన వంటి ఆరోపణల నేపథ్యంలో అమెరికా కోర్టు డాక్టర్ కల్రా వైద్య లైసెన్స్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అతని క్లినిక్‌ను పూర్తిగా మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అతడు గృహనిర్బంధంలో ఉన్నాడు. కోర్టులో దోషిగా తేలితే అతడికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ మొత్తంలో జరిమానా పడే అవకాశమున్నట్లు న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి.