
National Institutes of Health: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా జే భట్టాచార్య.. ధృవీకరించిన అమెరికా సెనేట్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నత పదవులను సాధిస్తున్నారు.
ఈ కోవలోనే, వైద్యరంగానికి చెందిన ప్రముఖ భారతీయ మూలాలున్న జయ్ భట్టాచార్య (Jay Bhattacharya)కు గౌరవప్రదమైన పదవి లభించింది.
ఆయనను నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) డైరెక్టర్‌గా యూఎస్ సెనెట్ ధ్రువీకరించింది.
వైద్య పరిశోధనలను పర్యవేక్షించే ప్రముఖ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్)కు తదుపరి డైరెక్టర్‌గా జయ్ భట్టాచార్య నియమితులవుతున్నట్లు నవంబర్‌లో ట్రంప్ ప్రకటించారు.
వివరాలు
నియామకానికి యూఎస్ సెనెట్ ఆమోదం
''భట్టాచార్యను ఎన్‌ఐహెచ్ డైరెక్టర్‌గా నియమించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాబర్ట్ ఎఫ్. కెన్నడీ జూనియర్ సహకారంతో, ఆయన ఎన్‌ఐహెచ్‌ను సమర్థవంతంగా నడిపించడంతో పాటు ప్రజల ప్రాణాలను రక్షించే కీలక ఆవిష్కరణలకు దారి తీసే విధంగా కృషి చేస్తారు. అమెరికాను తిరిగి ఆరోగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి వారిద్దరూ కలిసి పని చేస్తారు'' అని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ ప్రకటనపై జయ్ భట్టాచార్య హర్షం వ్యక్తం చేశారు. ''అధ్యక్షుడు ట్రంప్ నన్ను ఎన్‌ఐహెచ్ డైరెక్టర్‌గా నియమించడం గర్వకారణం. మేము అమెరికన్ శాస్త్రీయ సంస్థలను మెరుగుపరచి దేశాన్ని మరింత ఆరోగ్యవంతంగా మార్చేందుకు కృషి చేస్తాము'' అని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో, ఆయన నియామకానికి యూఎస్ సెనెట్ ఆమోదం లభించింది.
వివరాలు
జయ్ భట్టాచార్య ఎవరు?
జయ్ భట్టాచార్య 1968లో కోల్‌కతాలో జన్మించారు. 1997లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో డాక్టరేట్ పొందారు.
మూడేళ్ల తర్వాత అదే విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో హెల్త్ పాలసీ ప్రొఫెసర్‌గా, అలాగే నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్‌లో రీసెర్చ్ అసోసియేట్‌గా విధులు నిర్వర్తించారు.
కరోనా మహమ్మారి సమయంలో, అమెరికా ప్రభుత్వ విధానాలపై భట్టాచార్య బహిరంగంగా విమర్శలు చేశారు.
మరో ఇద్దరు ప్రముఖ విద్యావేత్తలతో కలిసి "గ్రేట్ బారింగ్టన్ డిక్లరేషన్"ను రూపొందించి ప్రచురించారు.