LOADING...
USA: అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య
అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య

USA: అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2025
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని డాలస్‌ నగరంలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. మోటల్‌ మేనేజర్‌గా పని చేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్య (50)ను సహోద్యోగి కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం, నాగమల్లయ్య మోటల్‌లో మార్టినెజ్ అనే ఉద్యోగితో కలిసి పని చేసేవారు. బుధవారం ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి విషయంపై వాగ్వాదం జరిగింది. మార్టినెజ్ గది శుభ్రం చేస్తున్న సమయంలో, విరిగిపోయిన వాషింగ్‌ మెషీన్‌ను ఉపయోగించవద్దని మల్లయ్య తెలిపాడు. అయితే, ఈ సూచనను నేరుగా మార్టినెజ్‌కి చెప్పకుండా, మరో మహిళా ఉద్యోగిని ద్వారా తెలియజేశారట. ఈ కారణంగా మార్టినెజ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.

వివరాలు 

స్పందించిన భారతీయ కాన్సులేట్

ఈక్రమంలో వీరి మధ్య వాగ్వాదం పెరగడంతో మార్టినెజ్ కత్తితో చంద్రమౌళిని పలుమార్లు తీవ్రంగా గాయపరిచాడు. నాగమల్లయ్య అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినా మార్టినెజ్ వెంటాడి, మరి తలనరికి చెత్తకుప్పలో పడేశాడు. ఈ దాడిని ఆపేందుకు మల్లయ్య కుటుంబసభ్యులు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. ఈ విషయంలో భారతీయ కాన్సులేట్ స్పందిస్తూ, ఈ హత్య తమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని తెలిపారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు, అవసరమైన సహాయం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారతీయ కాన్సులేట్ చేసిన ట్వీట్