Page Loader
USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణ హత్య.. 
అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణ హత్య..

USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణ హత్య.. 

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2025
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో భారతీయ మూలాలు కలిగిన ఒక వ్యాపారవేత్తను దారుణంగా హత్య చేసిన ఘటన టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్‌ నగరంలో జరిగింది. ఓ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలోనే అతనిపై మరో భారత సంతతికి చెందిన వ్యక్తి ఘాతుకంగా దాడి చేసి హతమార్చాడు. వివరాల్లోకి వెళితే... 30 ఏళ్ల అక్షయ్‌ గుప్తా అనే యువకుడు హెల్త్-టెక్ స్టార్టప్‌కు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. మే 14న టెక్సాస్‌లో ప్రయాణిస్తున్న బస్సులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బస్సులో వెనుకభాగంలో కూర్చున్న అక్షయ్‌పై అదే బస్సులో ఉన్న మరో భారతీయుడు దీపక్‌ కండేల్‌ ఆకస్మికంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గుప్తాను అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

వివరాలు 

అక్షయ్‌ నా మామలా కనిపించడంతోనే..

ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అధికారులు, ఘటనకు ముందు ఇద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం జరగలేదని స్పష్టంగా గుర్తించారు. దీపక్‌ కండేల్‌ అనుకోకుండా గుప్తాపై దాడి చేసినట్లు వీడియో ఆధారంగా తేలింది. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామని,అతనిపై హత్యారోపణలతో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ''అక్షయ్‌ నా మామలా కనిపించడంతోనే అతనిపై కత్తితో దాడి చేశాను'' అని దీపక్ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. అక్షయ్‌ గుప్తా విద్యార్హతల పరంగా పెన్‌ స్టేట్‌ యూనివర్శిటీలో మాస్టర్స్‌ పూర్తి చేశారు. ఇటీవల తన తాజా ప్రాజెక్టు నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లను కూడా కలిసినట్టు సమాచారం.