LOADING...
Canada: కెనడాలో భారత సంతతికి చెందిన మహిళ హత్య.. భారతదేశానికి నిందితుడు 
కెనడాలో భారత సంతతికి చెందిన మహిళ హత్య.. భారతదేశానికి నిందితుడు

Canada: కెనడాలో భారత సంతతికి చెందిన మహిళ హత్య.. భారతదేశానికి నిందితుడు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2025
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భారత మూలాలకు చెందిన 27 ఏళ్ల అమన్‌ప్రీత్ సైని అనే మహిళను దారుణ హత్యకు గురైంది. లింకన్ ప్రాంతంలోని ఓ పార్కులో ఆమె మృతదేహం గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. శరీరంపై గాయాలు ఉన్నాయని, ఇది హత్య కేసు అని ధృవీకరించారు. నిందితుడు భారతదేశానికి పారిపోయినట్టు కూడా సమాచారం అందింది. బ్రాంప్టన్ నగరంలో నివసించే అమన్‌ప్రీత్ సైని మృతదేహం అక్టోబర్ 21న లింకన్‌లోని ఓ పార్కులో కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో పంజాబ్‌కు చెందిన మన్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తమవుతోంది. అతనిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించి, తాజాగా అతడి ఫోటోను అధికారులు విడుదల చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కెనడాలో భారత సంతతికి చెందిన మహిళ హత్య

వివరాలు 

దేశం విడిచి పారిపోయిన మన్‌ప్రీత్ సింగ్

నిందితుడి గురించి సమాచారం తెలిసిన వారు పోలీసులను సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా భారత ప్రభుత్వంతో కూడా అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. అమన్‌ప్రీత్ సైని మృతదేహం బయటపడిన కొద్దిసేపటికే మన్‌ప్రీత్ సింగ్ దేశం విడిచి వెళ్లిపోయినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ ఘటనను ఉద్దేశపూర్వక హత్యగా పరిగణిస్తున్నామని, ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నామని నయాగరా ప్రాంతీయ పోలీస్ సర్వీస్ అధికార ప్రతినిధి తెలిపారు.