
Australia: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై కత్తితో దాడి.. వరుస దాడులతో ఆందోళన!
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాలో భారత సంతతి విద్యార్థులపై దాడులు మళ్లీ దాహాకంగా మారుతున్నాయి. ఇప్పటికే ఓ భారత విద్యార్థిపై దుండగులు దాడి చేసిన ఘటన మరిచిపోకముందే, తాజాగా మరో విద్యార్థిపై కత్తితో నరికి దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మెల్‌బోర్న్‌లో నివసిస్తున్న భారతీయ విద్యార్థి 'సౌరభ్ ఆనంద్'పై ఓ బృందం అత్యంత దారుణంగా దాడిచేసింది. సౌరభ్ ఆల్టోనా మెడోస్ ప్రాంతంలోని ఓ ఫార్మసీ నుంచి మందులు తీసుకొని ఇంటికి వెళ్లుతుండగా, ఐదుగురు యువకులు అతనిపై దాడి చేశారు. అప్పట్లో సౌరభ్ ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో నేరస్తులు అతడిని ఆవరించి, మెడపై కత్తితో నరకేందుకు యత్నించారు. అయితే అతడు తీవ్రంగా ప్రతిఘటించడంతో కత్తి అతని చేతిలోకి దూసుకుపోయింది.
Details
నలుగురిని అదుపులోకి తీసుకొని అధికారులు
అనంతరం దుండగులు అతడిని తలకు, మెడకు కత్తులతో గాయపరిచి పారిపోయారు. ఈ దాడిలో చేయి తెగిపోవడంతో బాధితుడిని ఆస్పత్రికి తరలించి అత్యవసర శస్త్రచికిత్స చేశారు. వైద్యులు ఆ చేతిని తిరిగి అతికించారని అధికారులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ఇదే తరహాలో ఇటీవల మరో భారత విద్యార్థి చరణ్‌ప్రీత్ సింగ్‌పై కూడా దాడి జరిగింది. పదునైన ఆయుధాలతో దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చరణ్ ముఖం, వెనుక భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.