India - Canada: దౌత్య వివాదం.. 86శాతం తగ్గిన కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య
భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖలిస్థానీ నేత నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాలు దౌత్య పరంగా కఠిన నిబంధనలను అవలంభిస్తున్నాయి. వాస్తవానికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు కెనడాకు చదువుకోవడానికి వెళుతుంటారు. అయితే నిజ్జర్ హత్య తర్వాత నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 2023లో భారతీయ విద్యార్థులకు తాము జారీ చేసిన స్టడీ పర్మిట్ల సంఖ్యలో భారీ క్షీణత కనిపించినట్లు కెనడా మంత్రి ఒకరు తెలిపారు. కెనడాకు వచ్చే ఇండియన్ స్టూడెండ్స్ సంఖ్య ఏకంగా 86శాతం తగ్గినట్లు వెల్లడించారు.
1,08,940 నుంచి 14,910కి పడిపోయిన పర్మిట్లు
వీసా అనుమతులను ప్రాసెస్ చేస్తున్న కెనడియన్ దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించడంతో పాటు ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై దౌత్యపరమైన వివాదం నెలకొన్న నేపథ్యంలో అతి తక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు మంత్రి చెప్పారు. అందుకే స్టడీ పర్మిట్ల జారీలో భారీగా క్షీణత కనిపించందన్నారు. 2022లో మొత్తం అనుమతులు 1,08,940కాగా.. అది 2023లో 14,910కి తగ్గినట్లు తగ్గాయని కెనడా మంత్రి తెలిపారు. ఈ వివాదం భారతీయ విద్యార్థులను ఇతర దేశాల్లో చదివేలా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు రుజువులు ఉన్నాయని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో చెప్పడంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజకుంది.