Page Loader
United States: టార్గెట్ స్టోర్'లో దొంగతనం చేస్తూ.. పట్టుబడిన భారత మహిళ 
టార్గెట్ స్టోర్'లో దొంగతనం చేస్తూ.. పట్టుబడిన భారత మహిళ

United States: టార్గెట్ స్టోర్'లో దొంగతనం చేస్తూ.. పట్టుబడిన భారత మహిళ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని టార్గెట్ స్టోర్‌లో లక్ష రూపాయలకు మించిన విలువ గల వస్తువులు దొంగిలించిన భారతీయ మహిళ ఒకరు పట్టుబడింది. ఆమె దొంగతనాన్ని బాడీక్యామ్ ద్వారా రికార్డ్ చేసిన ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ స్టేట్స్‌ సందర్శన కోసం వచ్చిన ఆమెను పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇల్లినాయిస్ ప్రాంతంలో ఉన్న టార్గెట్ స్టోర్‌లో ఏడు గంటల పాటు తిరుగుతూ అనుమానాస్పదంగా ప్రవర్తించిందని స్టోర్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్టోర్‌లో ఆమె దాదాపు లక్ష రూపాయలకుపైగా విలువైన వస్తువులను దొంగిలించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. స్టోర్‌లోని సీసీటీవీ,బాడీక్యామ్ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు.

వివరాలు 

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్న బాడీక్యామ్ వీడియో

అనుమానాస్పదంగా స్టోర్‌లో తిరుగుతున్న ఆమెను గమనించామని,వస్తువులు ఎంచుకుంటూ, ఫోన్‌ చూసుకుంటూ చివరకు బిల్లు చెల్లించకుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిందని స్టోర్ సిబ్బంది పోలీసులకు వివరించారు. వారు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని చేతులకు సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమెపై నేరారోపణలు మోపినప్పటికీ ఇంకా అధికారికంగా అరెస్ట్ చేయలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన బాడీక్యామ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై టార్గెట్ స్టోర్ యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న బాడీక్యామ్ వీడియో ఇదే..