
Green Card: భారతీయులకు గ్రీన్‌కార్డు దూరం.. అమెరికాలో ఉద్యోగ భద్రత క్షీణత!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ట్రంప్ పరిపాలన తర్వాత వీసాలు, గ్రీన్‌కార్డుల జారీ మరింత కఠినతరమైంది. ప్రస్తుతం, వీసాల జారీ, గ్రీన్‌కార్డ్ ప్రాసెసింగ్‌లో భారీగా జాప్యం జరగడంతో దేశంలోని కార్పొరేట్ రంగంపై ప్రభావం పడుతోంది. వర్క్ పర్మిట్‌లు ముగిసినా, పునరుద్ధరణ తక్షణమే జరగకపోవడం వల్ల పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు పదవులు వదులుతున్నారు. ఇటీవల అమెరికాలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ ట్రాన్సిట్ అథారిటీ (మార్టా) సీఈవో కొల్లిన్ గ్రీన్‌వుడ్ జూలై 17న పదవిని వీడారు. వర్క్ పర్మిట్ కాలవ్యవధి ముగియడంతో, గ్రీన్‌కార్డ్ ఆలస్యం కారణంగా ఆయన ఉద్యోగం కొనసాగడం సాధ్యపడలేదు. స్వదేశం కెనడాకు చెందిన గ్రీన్‌వుడ్ 2022 జనవరిలో మార్టా సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో మార్టా ఆర్థిక పరిస్థితి మెరుగైనప్పటికీ, వీసా ఇబ్బందులే రిటైర్మెంట్‌కు దారితీశాయి.
Details
ఇమిగ్రేషన్ బ్యాక్‌లాగ్‌లో 1.13 కోట్ల దరఖాస్తులు పెండింగ్
జూన్ 18న ఆయన వర్క్ అథరైజేషన్ డాక్యుమెంట్ గడువు ముగిసినా, గ్రీన్‌కార్డ్ రాకపోవడంతో, కెనడా వీసాపై తాత్కాలికంగా అమెరికాలో ఉంటూ, పదవిని వదిలేందుకు మొగ్గుచూపారు. అమెరికా రవాణా రంగంలో ఇలా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ ఆలస్యాల వల్ల పదవులు వదిలే హైప్రొఫైల్ అధికారుల సంఖ్య పెరుగుతోంది. వీరిలో చాలామంది ఇమిగ్రేషన్ టైమ్‌లైన్ ఆలస్యం, ఆపరేషనల్ సవాళ్లను కారణంగా చూపుతున్నారు. ఇక భారతీయుల గ్రీన్‌కార్డ్ దరఖాస్తుల విషయంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ప్రస్తుతం ఇమిగ్రేషన్ బ్యాక్‌లాగ్‌లో 1.13 కోట్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది ఓ రికార్డుగా నిలిచింది.
Details
దరఖాస్తుల సంఖ్య 2.7 మిలియన్లకు పరిమితం
ఇక 2025 రెండో త్రైమాసికంలో మరో 16 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఇటీవల విడుదల చేసిన డేటాలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈఏడాది రెండో త్రైమాసికంలో USCIS ప్రాసెస్ చేసిన దరఖాస్తుల సంఖ్య 2.7 మిలియన్లకు పరిమితమైంది. ఇది గతేడాది ఇదే కాలంలో ప్రాసెస్ చేసిన 3.3 మిలియన్లతో పోలిస్తే తక్కువ. ఫారమ్ I-90 కోసం వెయిటింగ్ టైమ్ గణనీయంగా పెరిగి 0.8 నెలల నుండి 8 నెలలకు చేరింది. అదేవిధంగా, ఫారమ్ I-765లో దాదాపు 2 మిలియన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆలస్యాలు కేవలం వ్యక్తిగత ప్రాజెక్టులకే కాక, కార్పొరేట్ రంగానికి సైతం ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.