NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Bangladesh: బాంగ్లాదేశ్ లో మళ్ళీ హింస.. 100 మంది మృతి 
    తదుపరి వార్తా కథనం
    Bangladesh: బాంగ్లాదేశ్ లో మళ్ళీ హింస.. 100 మంది మృతి 
    Bangladesh: బాంగ్లాదేశ్ లో మళ్ళీ హింస.. 100 మంది మృతి Bangladesh: బాంగ్లాదేశ్ లో మళ్ళీ హింస

    Bangladesh: బాంగ్లాదేశ్ లో మళ్ళీ హింస.. 100 మంది మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 05, 2024
    09:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బంగ్లాదేశ్‌లో ఉద్యోగ రిజర్వేషన్లు రద్దు చేయాలని, ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు, అధికార పార్టీ మద్దతుదారుల మధ్య చెలరేగిన హింసాకాండలో ఇప్పటివరకు 14 మంది పోలీసులతో సహా దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.

    వందలాది మంది గాయపడ్డారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే దేశం మొత్తం మీద నిరవధికంగా కర్ఫ్యూ విధించడంతోపాటు ఇంటర్నెట్‌పై నిషేధం విధించారు.

    వివరాలు 

    హింసాత్మకంగా మారిన నిరసన 

    ప్రభుత్వ ఉద్యోగాల కోటా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఆదివారం హింసాత్మకంగా మారింది.

    దేశ వ్యాప్తంగా జరిగిన ఘర్షణలు, కాల్పులు, ప్రతీకార దాడుల్లో కనీసం 100 మంది చనిపోయారని బంగ్లాదేశ్‌లోని ప్రముఖ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది.

    పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రకారం, దేశవ్యాప్తంగా 14 మంది పోలీసులు మరణించారు. వీరిలో 13 మంది సిరాజ్‌గంజ్‌లోని ఇనాయత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో మరణించారు. దాదాపు 300 మంది పోలీసులు గాయపడినట్లు సమాచారం.

    వివరాలు 

    హింస ఎందుకు చెలరేగిందంటే  

    ఈ అంశంపై బంగ్లాదేశ్‌లో పలుమార్లు హింస చెలరేగింది. వాస్తవానికి 1971 నాటి స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే కోటా విధానాన్ని రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

    గతంలో హింస చెలరేగినప్పుడు కోర్టు కోటా పరిమితిని తగ్గించింది. కానీ హింస ఆగలేదు. ఇప్పుడు ఆందోళనకారులు షేక్ హసీనా రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు.

    ఇప్పటి వరకు 11,000 మందికి పైగా అరెస్టు చేశారు. ఆందోళనకారులు పోలీసు స్టేషన్లు, అధికార పార్టీ కార్యాలయాలు,వారి నాయకుల నివాసాలపై దాడి చేశారని, అనేక వాహనాలను తగులబెట్టారని అధికారులు పేర్కొన్నారు.

    ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మెటా ప్లాట్‌ఫారమ్‌లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

    వివరాలు 

    ఆందోళనకారులను టెర్రరిస్టులన్న  ప్రధాని 

    కాగా, నిరసనల పేరుతో దేశవ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడుతున్న వారు విద్యార్థులు కాదని, ఉగ్రవాదులని, వారిని కఠినంగా అణచివేయాలని ప్రధాని హసీనా కోరారు.

    ఈ ఉగ్రవాదులను కఠినంగా అణిచివేయాలని దేశప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను' అని ఆమె అన్నారు. రక్షణ శాఖ అధికారులతో ప్రధాని అత్యవసర సమావేశం కూడా నిర్వహించారు.

    అదే సమయంలో, హింసాత్మక నిరసనల మధ్య, ప్రభుత్వం సోమ, మంగళ, బుధవారాల్లో మూడు రోజుల సాధారణ సెలవు ప్రకటించింది.

    వివరాలు 

    పన్నులు, బిల్లులు చెల్లించనందుకు అప్పీల్ 

    ఆందోళనకారులు పన్నులు, బిల్లులు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆదివారం కూడా పనికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.

    ఢాకాలోని షాబాగ్ ప్రాంతంలోని బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్శిటీ, ఆసుపత్రితో సహా ఆదివారం బహిరంగ కార్యాలయాలు,సంస్థలపై కూడా నిరసనకారులు దాడి చేశారు.

    ఢాకాలోని ఉత్తరా ప్రాంతంలో కొన్ని ముడి బాంబులు పేలాయని, తుపాకీ శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

    వివరాలు 

    జులైలో కూడా హింస చెలరేగింది 

    ఢాకాలోని మున్షిగంజ్ జిల్లాకు చెందిన ఓ పోలీసు మీడియాతో మాట్లాడుతూ.. ''నగరం మొత్తం రణరంగంగా మారిపోయింది'' అని అన్నారు.

    నిరసన నాయకులు వెదురు కర్రలతో తమను తాము ఆయుధాలుగా చేసుకోవాలని నిరసనకారులకు పిలుపునిచ్చారు, జూలైలో మునుపటి రౌండ్ నిరసనలు చాలావరకు పోలీసులచే అణిచివేయబడ్డాయి.

    బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాకాండను దృష్టిలో ఉంచుకుని, భారత పౌరులు పొరుగు దేశానికి వెళ్లవద్దని భారత ప్రభుత్వం సలహా ఇచ్చింది.

    బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయ పౌరులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని, వారి కదలికలను పరిమితం చేయాలని,వారి అత్యవసర ఫోన్ నంబర్‌ల ద్వారా ఢాకాలోని భారత హైకమిషన్‌తో సన్నిహితంగా ఉండాలని సూచించారు.

    దీంతోపాటు దీని కోసం ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగ్లాదేశ్

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    బంగ్లాదేశ్

    Asia Cup : నేడు భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌.. వర్షం ప్రభావం చూపుతుందా? టీమిండియా
    ICC World Cup 2023: వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. మాజీ కెప్టెన్‌కి దక్కని చోటు! వన్డే వరల్డ్ కప్ 2023
    WORLD CUP 2023 : ప్రపంచకప్‌లోనే ఇంగ్లండ్ మూడో అత్యధిక స్కోరు ఇదే ఇంగ్లండ్
    World Cup 2023 : ఇంగ్లండ్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్‌కు మరో షాక్ ఇంగ్లండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025