Donald Trump : భారత్‌ను 'నరకం'తో పోల్చిన ట్రంప్.. స్పందించిన కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను "నరకం"తో పోల్చిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జయస్వాల్ మీడియా ప్రశ్నలకు సమాధానంగా, "ఆ వ్యాఖ్యలను మేము గమనించాం. అయితే వాటిపై ఇకపై వ్యాఖ్యానించడం అవసరం లేదని భావిస్తున్నాం" అని తెలిపారు. అమెరికాలో అమలులో ఉన్న జన్మతః పౌరసత్వ విధానాన్ని ట్రంప్ చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అమెరికన్ రేడియో హోస్ట్ మైఖెల్ సావేజ్ పంచుకున్న ఒక లేఖను ఆయన మళ్లీ షేర్ చేశారు.
వివరాలు
భారత్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు..
ఆ లేఖలో ఆసియా దేశాలకు చెందిన గర్భిణులు ప్రసవానికి ముందే అమెరికాకు చేరుకుని అక్కడే బిడ్డకు జన్మనిస్తారన్నారు. ఆ తరువాత అక్కడి చట్టాల ప్రకారం ఆ శిశువుకు వెంటనే అమెరికా పౌరసత్వం లభిస్తుందని పేర్కొన్నారు. ఇంకా ఆ పౌరసత్వాన్ని ఆధారంగా చేసుకుని వారు తమ కుటుంబ సభ్యులను చైనా, భారత్ లేదా ఇతర దేశాల నుండి అమెరికాకు తీసుకువస్తారని ఆ లేఖలో పేర్కొంటూ, భారత్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.