న్యూయార్క్: విమానం ఎన్ఆర్ఐ వైద్యుడి అసభ్యకర చేష్టలు.. బాలిక ఫిర్యాదుతో అరెస్ట్
రోజురోజుకూ విమాన ప్రయాణం అంటేనే నరకంలా తయారువుతోంది. గత కొంతకాలంగా విమానాల్లోనూ లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. విమానాల్లో ప్రయాణాలు చేసేది విద్యావంతమైన సమాజమే అయినప్పటికీ మహిళలపై ఆకృత్యాలు ఆగట్లేదు. తాజాగా లైంగిక వేధింపుల కేసులో అమెరికా న్యూయార్క్‌కు చెందిన 33 ఏళ్ల భారత సంతతి వైద్యుడు (INDO AMERICAN) సుదీప్త మొహంతిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో బాలిక (మైనర్) ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ మేరకు కేసు నమోదు పోలీసులు ఆయన్ను ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో పలు ఆంక్షలు విధిస్తూ వైద్యుడిని విడుదల చేశారు. తన స్నేహితురాలితో కలిసి అదే ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న మహంతి, సీట్ల సర్దుబాటులో బాలిక పక్క సీట్లో కూర్చున్నాడు.
90 రోజుల జైలు శిక్ష, రూ.4.15 లక్షల ఫైన్
ఫిజిషియన్ గా పని చేస్తున్న మొహంతి గతేడాది మేలో హోనోలులు నుంచి బోస్టన్ వెళ్తున్నారు. ఇదే విమానంలో 14 ఏళ్ల మైనర్ బాలిక తన తాత, అమ్మమ్మలతో కలిసి ప్రయాణిస్తోంది. అయితే ప్రయాణంలో మొహంతి పక్క సీటులో ఓ బాలిక కూర్చుంది. విమానం గాల్లో ఉన్న సమయంలో డాక్టర్ అసభ్యకర చేష్టలు చేస్తున్నట్లు గుర్తించిన బాధితురాలు, ఇతర ఖాళీ సీట్లోకి వెళ్లి కూర్చుంది. సదరు ఫ్లైట్ బోస్టన్‌లో ల్యాండయ్యాక ఎయిర్ లైన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విమానయాన అధికారులు ఆయనపైపై కేసు నమోదు చేశారు. అమెరికా చట్టాల మేరకు విమాన ప్రయాణంలో అసభ్యకరంగా ప్రవర్తిస్తే 90 రోజుల పాటు జైలు శిక్షతో పాటు రూ.4.15 లక్షల అపరాధ రుసుం విధిస్తారు.