Kim Jong: ఉత్తర కొరియా మహిళల ఎదుట ఏడ్చేసిన కిమ్.. కారణం ఇదే..
ఉత్తర కొరియా(North Korea) పాలకుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong-un) ఎంత నియంత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కఠినమైన ఆంక్షలతో దేశాన్ని తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్నారు. ఇన్నాళ్లు దేశ ప్రజలకు కన్నీళ్లు తెప్పించే ఆంక్షలు విధించిన కిమ్.. తాజాగా స్వయంగా ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. ఇప్పుడు ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆయన ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడో తెలుసుకుందాం. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ఐదో జాతీయ తల్లుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలని కిమ్ భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు. దేశంలోని మహిళలు ఎక్కువ మంది పిల్లలను కని, వారిని కమ్యూనిస్టుల్లా పంచాలని కోరారు.
మహిళలు బలంగా ఉంటేనే దేశం బలంగా: కిమ్
దేశంలో తగ్గుతున్న జననాల రేటుపై కిమ్ జాంగ్ ఉన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని, జనన రేటును పెంచడం ప్రాముఖ్యతను కిమ్ నొక్కి చెప్పారు. తొలుత కిమ్ తన ప్రసంగాన్ని ఏడుపుతోనే ప్రారంభించారు. ఈ క్రమంలో తన కన్నీళ్లను రుమాలుతో తుడుచుకంటూ మాట్లాడారు. జననాల రేటు పెంచడం, పిల్లలకు మంచి సంరక్షణ, విద్యను అందించడం తమ మా కర్తవ్యమని కిమ్ ఆ సమావేశంలో అన్నారు. కిమ్ ప్రసంగం మొత్తం జననాల రేటు, చిన్నారుల పెంపకంలో మహిళల పాత్రపైనే ఉందని ఆ దేశ మీడియా పేర్కొంది. మహిళలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని కిమ్ వివరించారు.