Donald Trump: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ట్రంప్ తొలి విజయం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసేందుకు సిద్ధమతున్న విషయం తెలిసిందే.
అమెరికా అధ్యక్ష పదవి రేసులో డొనాల్డ్ ట్రంప్ ఒక అడుగు ముందుకు వేశారు.
సోమవారం అయోవాలో జరిగిన మొదటి రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పోటీ 'కాకస్ (caucuses)'లో ట్రంప్ విజయం సాధించారు.
ఈ విజయంతో 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో బైడెన్‌కు గట్టి పోటీనిచ్చేది ట్రంప్ మాత్రమే అని చర్చ నడుస్తోంది.
అమెరికా కాలామానం ప్రకారం సోమవారం సాయంత్రం 7 గంటలకు అయోవా 'కాకస్' పోలింగ్ ప్రారంభమైంది.
దాదాపు 1600 కంటే ఎక్కున స్థానాల్లో లైబ్రరీలు, పాఠశాలలు, ప్లేగ్రౌండ్‌ల్లో ఈ పోలింగ్ జరిగింది.
ట్రంప్
'అయోవా కాకస్' అంటే ఏమిటి
అమెరికాలో రెండు ప్రధాన పార్టీలుగా డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఉన్నాయి.
అధ్యక్ష ఎన్నికల ముందు దేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రధాన పార్టీలు తమ అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేసేందుకు అంతర్గతంగా ఓటింగ్ నిర్వహిస్తాయి. దీన్నే 'కాకస్' అంటారు.
అన్ని రాష్ట్రాల్లో ఓటు జరిగిన తర్వాత.. ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని , జాతీయ సమావేశం నిర్వహించి.. తమ అధ్యక్ష అభ్యర్థిని పార్టీలు ప్రకటిస్తారు.
ఈ క్రమంలో రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన మొదటి 'కాకస్' ఎన్నిక.. అయోవా రాష్ట్రంలో జరిగింది.
ఇందులో డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. ఇతర రాష్ట్రాలలోనూ వేర్వేరు తేదీల్లో ఇలాంటి కాకస్‌లు నిర్వహిస్తారు.
జులైలో జరిగే రిపబ్లికన్ పార్టీ సమావేశంలో అధ్యక్ష అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటిస్తారు.
అమెరికా
ఏమాత్రం తగ్గని ట్రంప్ క్రేజ్
ట్రంప్‌కు ప్రత్యర్థులుగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ, రామస్వామి నిలబడ్డారు.
అయితే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది ఇంకా తెలియాల్సి ఉంది.
సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ లేదా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ రెండో స్థానంలో ఉంటారని అంచనా.
అయోవా తర్వాత.. న్యూ హాంప్‌షైర్, నెవాడా, సౌత్ కరోలినాలో కూడా కాకస్‌లు జరుగుతాయి.
ఏది ఏమైనప్పటికీ, మొదటి కాకస్ అయినందున, అందరి దృష్టి అయోవాపైనే ఉంది.
ఇక్కడ విజయం సాధించడం వల్ల రాబోయే రోజుల్లో పరిస్థితులు ట్రంప్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంది.
అంతేకాకుండా, రిపబ్లికన్ ఓటర్లు ఇప్పటికీ ట్రంప్‌కు గట్టి మద్దతు ఇస్తున్నారని కూడా ఈ విజయం స్పష్టం చేసింది.