Iran: 'మరోసారి తప్పుదారి పట్టించారు': నిరసనల్లో అరెస్టయిన 8 మంది మహిళల ఉరిశిక్షపై ఇరాన్ క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌లో ఈ ఏడాది ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా అరెస్టయిన 8 మంది మహిళలకు ఉరిశిక్ష విధించే అవకాశముందని వెలువడిన వార్తలను ఆ దేశ న్యాయవ్యవస్థ మంగళవారం ఖండించింది. ఈ మహిళలను విడుదల చేస్తే చర్చలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్ అధికారులు, ఈ సమాచారం పూర్తిగా అసత్యమని తెలిపారు. తప్పుడు సమాచారంతో ట్రంప్ మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఉరిశిక్షకు గురవుతున్నారని చెబుతున్న మహిళల్లో కొందరిని ఇప్పటికే విడుదల చేసినట్లు, మిగిలిన వారిపై ఉన్న కేసులు రుజువైనా వారికి అత్యధికంగా జైలు శిక్ష మాత్రమే విధించబడుతుందని ఇరాన్ న్యాయవ్యవస్థ అధికారిక వెబ్‌సైట్ వెల్లడించింది.
వివరాలు
నిందితుల్లో ఒకరికి ఇప్పటికే మరణశిక్ష పడిందంటున్న హక్కుల సంఘాలు
అయితే మానవ హక్కుల సంస్థలు మాత్రం ఇరాన్ వాదనను అంగీకరించడం లేదు. అరెస్టయిన మహిళల్లో బీతా హెమ్మతికి ఇప్పటికే మరణశిక్ష విధించారని,మరో మహిళ మహబూబే షబానీపై'దేవుడిపై యుద్ధం'అనే తీవ్రమైన ఆరోపణ మోపినట్లు చెబుతున్నాయి. ఈఆరోపణ కింద కూడా ఉరిశిక్ష పడే ప్రమాదం ఉందని అవి పేర్కొన్నాయి. నిరసనల్లో గాయపడిన వారికి తన మోటార్ సైకిల్‌పై సహాయం చేసిందనే ఆరోపణలతో షబానీని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ 8మంది మహిళల వివరాలను అమెరికాలో నివసిస్తున్న ఇరాన్ కార్యకర్త మసిహ్ అలీనెజాద్ వెల్లడించారు. సమాజంలో భయాందోళనలు సృష్టించేందుకు ఇరాన్ ప్రభుత్వం మరణశిక్షలను ఒక సాధనంగా వినియోగిస్తోందని హక్కులసంఘాలు విమర్శిస్తున్నాయి. 2025సంవత్సరంలో ఇరాన్‌లో 48మంది మహిళలు సహా మొత్తం 1,639మందికి మరణశిక్ష అమలు చేసినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అరెస్టయిన మహిళలకు ఉరిశిక్ష ముప్పు లేదన్న ఇరాన్
"To the Iranian leaders, who will soon be in negotiations with my representatives: I would greatly appreciate the release of these women. I am sure that they will respect the fact that you did so. Please do them no harm! Would be a great start to our negotiations!!!" - President… pic.twitter.com/pxU8xZFvAh
— The White House (@WhiteHouse) April 21, 2026