LOADING...
Iran: మా అనుమతి లేకుండా ఒక్క నౌకకు కూడా హర్మూజ్'లో ప్రవేశం లేదు: ఇరాన్ హెచ్చరిక
మా అనుమతి లేకుండా ఒక్క నౌకకు కూడా హర్మూజ్'లో ప్రవేశం లేదు: ఇరాన్ హెచ్చరిక

Iran: మా అనుమతి లేకుండా ఒక్క నౌకకు కూడా హర్మూజ్'లో ప్రవేశం లేదు: ఇరాన్ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
May 03, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్ జలసంధిపై తమకు సంపూర్ణ ఆధిపత్యం ఉందని ఇరాన్ సైన్యం స్పష్టంగా వెల్లడించింది. తమఅనుమతి లేకుండా స్నేహ దేశాలైనా, శత్రు దేశాలైనా ఏ నౌక కూడా ఈ మార్గం గుండా ప్రయాణించలేదని తెలిపింది. ఈజలసంధిని నియంత్రించడం తమ సహజ హక్కు అని ఇరాన్ సైన్య ప్రతినిధి మహమ్మద్ అక్రమినియా పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ ఇస్లామిక్ విప్లవ గార్డ్ దళాలు,దేశ సైన్యం కలిసి హర్మూజ్ జలసంధిపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాయని ఆయన వివరించారు. తమఅనుమతి లేకుండా ఏ నౌకకూ ఈ మార్గంలో ప్రయాణించే అధికారం లేదని తేల్చి చెప్పారు. మరోవైపు,తమ నౌకలకు అనుమతి ఇవ్వాలని పలు దేశాలు అత్యవసరంగా సందేశాలు,లేఖల ద్వారా ఇరాన్‌ను కోరుతున్నాయని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి హమీద్ ఘన్‌బారీ తెలిపారు.

వివరాలు 

పెర్షియన్ గల్ఫ్ భవిష్యత్తు 'అమెరికా రహితంగా' ఉంటుందని వ్యాఖ్య

ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 నుంచి హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తన నియంత్రణను మరింత కట్టుదిట్టం చేసింది. తమ భూభాగంపై అమెరికా,ఇజ్రాయెల్ కలిసి దాడులు జరిపిన నేపథ్యంలో,ఆ దేశాలకు చెందిన లేదా వాటితో సంబంధం ఉన్న నౌకలపై ఇరాన్ నిషేధం విధించింది. ఇకపోతే, పెర్షియన్ గల్ఫ్,హర్మూజ్ జలసంధిలో కొత్త దశ ప్రారంభం కానుందని ఇరాన్ అత్యున్నత నాయకుడు మొజ్తబా ఖొమైనీ అన్నారు. ఈ జలసంధి నిర్వహణ కోసం త్వరలోనే కొత్త చట్టపరమైన విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ విధానం ప్రాంతంలోని అన్ని దేశాల అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. భవిష్యత్తులో పెర్షియన్ గల్ఫ్ ప్రాంతం అమెరికా ప్రభావం లేకుండా శాంతి, సమృద్ధితో ముందుకు సాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement