LOADING...
US F-18 Fighter Jet: ఇరాన్ సంచలన ఆరోపణ.. ఎఫ్-18 ఫైటర్ జెట్ కూల్చేశామంటూ ట్వీట్
ఇరాన్ సంచలన ఆరోపణ.. ఎఫ్-18 ఫైటర్ జెట్ కూల్చేశామంటూ ట్వీట్

US F-18 Fighter Jet: ఇరాన్ సంచలన ఆరోపణ.. ఎఫ్-18 ఫైటర్ జెట్ కూల్చేశామంటూ ట్వీట్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2026
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఇరాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికాకు చెందిన ఎఫ్-18 ఫైటర్ జెట్‌ను కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎక్స్ (సోషల్ మీడియా) వేదికగా వెల్లడించింది. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? అనే వివరాలను మాత్రం ఇరాన్ వెల్లడించలేదు. ఇదే సమయంలో ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్‌లో విమానం కూల్చివేతకు సంబంధించిన ఒక వీడియో ప్రసారం అయింది. ఆ వీడియోలో మిసైల్ వేగంగా దూసుకెళ్లి విమానాన్ని ఢీకొట్టినట్టు కనిపించింది. దాడి తర్వాత ఫైటర్ జెట్ అదుపు తప్పినట్టు చూపించారు. కానీ, పైలట్ పరిస్థితి గురించి మాత్రం ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇరాన్ చేసిన ట్వీట్ 

వివరాలు 

అది పూర్తిగా అబద్ధం: అమెరికా 

ఇరాన్ చేసిన ఈ ప్రకటనను అమెరికా పూర్తిగా ఖండించింది. తమ ఎఫ్-18 ఫైటర్ జెట్‌ను ఇరాన్ కూల్చలేదని స్పష్టం చేసింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఇరాన్ చెప్పిన విషయాల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది. అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలతో తమ విమానాన్ని కూల్చినట్లు చెప్పడం వాస్తవానికి దూరమని అమెరికా పేర్కొంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెరికా చేసిన ట్వీట్ 

Advertisement

వివరాలు 

గతంలోనూ ఇలాంటి ప్రకటనలే

ఇది మొదటిసారి కాదు.. గతంలో కూడా ఇరాన్ ఇలాంటి ప్రకటనలు చేసింది. అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్-35 ఫైటర్ జెట్‌పై మిసైల్ దాడి చేశామని అప్పట్లో ప్రకటించింది. ఆ ఘటనలో ఎఫ్-35 ఫైటర్ జెట్ ఇరాన్ గగనతలంలో అత్యవసర ల్యాండింగ్ చేసిన విషయం అమెరికా కూడా ధ్రువీకరించింది. అయితే, ఆ విమానం దెబ్బతినడానికి నిజంగా శత్రు దేశం దాడే కారణమా? అనే విషయంపై మాత్రం అమెరికా స్పష్టత ఇవ్వలేదు.

వివరాలు 

"ఒక్క విమానం కూడా కూల్చలేదు": యూఎస్

ఇరాన్ ఆరోపణలపై యూఎస్ సెంట్రల్ కమాండ్ తరచూ స్పందిస్తూ వస్తోంది. "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ"లో భాగంగా ఇప్పటివరకు 8 వేల ఫైటర్ జెట్ మిషన్లు నిర్వహించామని తెలిపింది. ఇరాన్ ఒక్కసారి కూడా తమ విమానాలను కూల్చలేదని అమెరికా స్పష్టం చేసింది. అణ్వాయుధాల కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఫిబ్రవరి 28న యూఎస్ "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" పేరుతో గగనతల దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. చర్చలపై సందిగ్ధత ప్రస్తుతం గగనతల దాడులకు అమెరికా తాత్కాలిక విరామం ప్రకటించింది. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని యూఎస్ పేర్కొంది. అయితే, అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరగట్లేదని ఇరాన్ స్పష్టంగా వెల్లడించింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని అర్థమవుతోంది.

Advertisement