Iran: ఆంక్షలు ఉన్నా ఫుల్ స్పీడ్'లో చాబహార్ పనులు.. హోర్ముజ్‌లో భారత నౌకలకు ఎలాంటి అడ్డంకులు లేవు: ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌కు చెందిన భారత రాయబారి డా. మొహమ్మద్ ఫతహాలి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్‌పై ఆంక్షలు ఉన్నా పనులు ఆగడంలేదని స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న అడ్డంకుల వార్తలు కేవలం ఊహాగానాలేనన్నారు. అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ కొత్త ప్రతిపాదనలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదని తెలిపారు. యుద్ధం కాకుండా శాంతి ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరాన్ భావిస్తోందని చెప్పారు. అణు ఒప్పందం విషయంలో శాంతియుత అణు శక్తి వినియోగ హక్కు తమకు అత్యంత ముఖ్యమని, అలాగే విధించిన ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయాలని కోరారు.
వివరాలు
ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయుల భద్రతకు పూర్తి హామీ
హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఎలాంటి ఆంక్షలు లేవని, ఇప్పటికే పలు భారత నౌకలు సురక్షితంగా ప్రయాణించాయని వెల్లడించారు. చాబహార్-జాహేదాన్ రైల్వే లైన్ 90 శాతం పూర్తైందని, 2026 చివరినాటికి మరిన్ని మౌలిక వసతులు సిద్ధమవుతాయని చెప్పారు. ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయుల భద్రతకు పూర్తి హామీ ఉందని, మత స్వేచ్ఛ కొనసాగుతోందని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్, ఈ పరిస్థితుల తర్వాత తాము మరింత దృఢంగా, బలంగా మారామని వెల్లడించింది. మొత్తం మీద, ఉద్రిక్తతల మధ్య కూడా ఇరాన్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే చర్చలకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.