LOADING...
Iran: అమెరికాతో చర్చలేవు.. ఇరాన్ స్పష్టం.. శాంతి ప్రతిపాదనకు నో 
అమెరికాతో చర్చలేవు.. ఇరాన్ స్పష్టం.. శాంతి ప్రతిపాదనకు నో

Iran: అమెరికాతో చర్చలేవు.. ఇరాన్ స్పష్టం.. శాంతి ప్రతిపాదనకు నో 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2026
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ స్పష్టంగా ప్రకటించింది. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో కొనసాగుతున్న యుద్ధం రెండో నెలలోకి అడుగుపెట్టిన ఈ సమయంలో, చర్చలు సానుకూలంగా ఉన్నాయన్న వైట్ హౌస్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్షంగానీ,పరోక్షంగానీ ఎలాంటి సంప్రదింపులు జరుగడం లేదని తేల్చి చెప్పింది. ఈ అంశంపై ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ సోషల్ మీడియా వేదిక X ద్వారా స్పందించారు. గత 31 రోజులుగా అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. చర్చల పేరుతో పాకిస్థాన్ వంటి మధ్యవర్తుల ద్వారా అమెరికా కొన్ని ప్రతిపాదనలు పంపిందని, కానీ అవి అధికారిక చర్చలుగా పరిగణించలేమని పేర్కొన్నారు.

వివరాలు 

ఇరాన్ వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా అమెరికా

గతంలో ఎదురైన దౌత్యపరమైన చేదు అనుభవాలు, నమ్మకద్రోహాలను మర్చిపోలేదని, ప్రస్తుతం తమ ప్రధాన లక్ష్యం దేశ రక్షణనేనని తెలిపారు. ఇక ఇరాన్ వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా అమెరికా స్పందిస్తోంది. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, అవి సానుకూల దిశలోనే ఉన్నాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు. త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు.

వివరాలు 

ఇరాన్ ఐదు కీలక షరతులు 

వివాదాన్ని ముగించేందుకు ట్రంప్ ప్రతిపాదించిన 15 అంశాల శాంతి ప్రణాళికను ఇరాన్ పూర్తిగా తిరస్కరించింది. దానికి ప్రతిగా యుద్ధ నష్టపరిహారం, ఆంక్షల ఎత్తివేత వంటి ఐదు కీలక షరతులను ముందుకు తెచ్చింది. ఇరు దేశాల నుంచి వస్తున్న ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు చూస్తుంటే, ఈ యుద్ధం త్వరలో ముగిసే సూచనలు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యుద్ధంపై మాట్లాడుతున్న కరోలిన్ లీవిట్

Advertisement