LOADING...
Donald Trump: రోజుకు రూ.4,600 కోట్లు కోల్పోతున్న ఇరాన్ : డొనాల్డ్ ట్రంప్
రోజుకు రూ.4,600 కోట్లు కోల్పోతున్న ఇరాన్ : డొనాల్డ్ ట్రంప్

Donald Trump: రోజుకు రూ.4,600 కోట్లు కోల్పోతున్న ఇరాన్ : డొనాల్డ్ ట్రంప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 19, 2026
07:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్ జలసంధిలో పలు నౌకలపై ఇరాన్ దాడులు జరిపిందని, ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ఇరాన్ రోజుకు సుమారు రూ.4,600 కోట్లు (500 మిలియన్ డాలర్లు) నష్టపోతోందని ఆయన తెలిపారు. అదే సమయంలో అమెరికాకు ఎలాంటి నష్టమూ జరగలేదని స్పష్టం చేశారు. ఇరాన్‌తో చర్చల కోసం తమ ప్రతినిధులు సోమవారం పాకిస్థాన్‌కు చేరుకోనున్నారని ట్రంప్ వెల్లడించారు. మేము న్యాయమైన, సహేతుకమైన ఒప్పందాన్ని ఇరాన్ ముందుంచాం. ఆ దేశం దానిని అంగీకరిస్తుందని ఆశిస్తున్నాం.

వివరాలు

మొదటి విడత శాంతి చర్చలు విఫలం

లేకపోతే ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను ధ్వంసం చేస్తాం. ఇకపై నేను అంత మంచివాడిగా ఉండను. ఇరాన్ యంత్రాంగానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఇక ఇటీవల పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన మొదటి విడత శాంతి చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చల్లో ఇరుదేశాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఇరాన్ తమ షరతులను అంగీకరించలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. అయితే, అమెరికా అర్థం లేని డిమాండ్లు చేసిందని ఇరాన్ ప్రతిగా ఆరోపించింది.

Advertisement