Minab school attack: ఇరాన్‌లో పాఠశాలపై మిసైల్ దాడి… అమెరికా అధికారుల ఫొటోలు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌లోని ఒక పాఠశాలపై అమెరికా జరిపిన క్షిపణి దాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీసింది. ఈ దారుణ ఘటనలో అమాయక చిన్నారులు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకు కారణమైంది. ఈ సంఘటనకు సంబంధించి తాజాగా ఇరాన్ కీలక చర్య తీసుకుంది.ఈ దాడికి కారణమయ్యారని పేర్కొంటూ అమెరికా నౌకాదళ అధికారుల ఫొటోలను బయటకు విడుదల చేసింది. ఈవిషయాన్ని సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్‌లో వెల్లడిస్తూ,చిన్నారుల మృతికి బాధ్యులు వీరేనని ఆరోపించింది. ఫిబ్రవరి 28న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC)స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేపట్టింది. అయితే ఈ దాడుల సమయంలో మినాబ్ ప్రాంతంలో ఉన్న ఒక పాఠశాలపై అమెరికాకు చెందిన తొమహాక్ క్షిపణి తప్పుగా పడింది.
వివరాలు
దాడికి బాధ్యులుగా భావిస్తున్న అమెరికా నౌకాదళ అధికారుల ఫొటోలు విడుదల
ఈ విషాద ఘటనలో 160మందికి పైగా చిన్నారులు,అలాగే 14మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్పందనకు దారితీసింది.ఈ నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికా, నైజీరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయాలు సంయుక్తంగా కీలక ప్రకటన చేశాయి. దాడికి బాధ్యులుగా భావిస్తున్న అమెరికా నౌకాదళ అధికారులైన జెఫ్రీ ఇ. యార్క్,లీ ఆర్ టేట్ ఫొటోలను ఎక్స్‌లో విడుదల చేశాయి. ''ఈ ఇద్దరు వ్యక్తులను గుర్తుంచుకోండి.వీరే మూడు సార్లు తొమహాక్ క్షిపణులను ప్రయోగించారు.168 మంది చిన్నారుల మృతికి కారణమయ్యారు''అని ఆ రాయబార కార్యాలయాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. యుద్ధ చర్యల్లో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం మానవత్వానికి పెద్ద ముప్పుగా మారిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.